సందీప్ `భైరవకోన`కి మోక్షమెప్పుడో?
మరీ కాపీ అనే మరకపడకుండా ఆనంద్ అవసరం మేర రీషూట్లు కూడా చేసినట్లు వార్తలొచ్చాయి.
2021 తర్వాత యంగ్ హీరో సందీప్ కిషన్ వేగం బాగా తగ్గింది. ఏడాదికి కనీసం మూడు..నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించే సందీప్ గతేడాది ఒక సినిమాతో కూడా పలకరించలేదు. ఈ ఏడాది కూడా ఇప్పటి వరకూ కేవలం ఒక సినిమాతోనే అలరించాడు. అదే `మైఖెల్`. ఏడాది ఆరంభంలో ఫిబ్రవరిలో సినిమా రిలీజ్ అయింది. అదీ కూడా షరా మాములు ఫలితమే సాధించింది. ప్రస్తుతం సందీప్ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.
అందులో `ఊరు పేరు భైరవకొన ఒకటి`. `ఎక్కడికిపోతావు చిన్నవాడా`..` టైగర్`..`డిస్కోరాజా` లాంటి వైవిథ్యమైన చిత్రాలు తెరకెక్కించిన వి.ఐ ఆనంద్ పనిచేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకి పాజిటివ్ వైబ్ ని తీసుకొచ్చాయి. అయితే ఇవి రిలీజ్ అయి చాలా కాలమవుతుంది. మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది `విరూపాక్ష` తరహాలో ఉండే సినిమా అన్న ఎగ్జైట్ మెంట్ కలిగిస్తుంది.
మరీ కాపీ అనే మరకపడకుండా ఆనంద్ అవసరం మేర రీషూట్లు కూడా చేసినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈసినిమా రిలీజ్ ఎప్పుడు అన్నది క్లారిటీ లేదు. అలాగే ఈసినిమా నిర్మాత రాజేష్ దండ... అనీల్ సుంకర. వీరిద్దరు డిస్ట్రిబ్యూషన్ పరంగా ఈ మధ్య కాలంలో కొన్ని రకాల నష్టాలు చూసారు. ఒకటి రెండు సినిమాలు హిట్ అయినా...ప్లాప్ ల రూపంలో వాటిని బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది. ఆరకంగాను సినిమాకి ఎదురుదెబ్బ పడిందని ప్రచారం సాగుతోంది.
అలాగే ఒకవేళ ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయాలన్నా? కుదిరే పనికాదు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ తేదీల్ని బ్లాక్ చేసాయి. సంక్రాంతి వరకూ థియేటర్లన్ని బ్లాక్ అవుతున్నాయి. ఒకవేళ రిలీజ్ చేయాలన్నా అన్ని రకాల సెక్యురిటీలు చూసుకుని రిలీజ్ చేయాలి. సినిమాకి పాజిటివ్ వైబ్ ఉంది కాబట్టి దాన్ని తెలివిగా ఎన్ క్యాష్ చేసుకోగలగాలి.