నా కొడుకుని అలానే పెంచాలనుకుంటున్నా!
కమర్షియల్ యాడ్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన యామీ గౌతమ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది.;
కమర్షియల్ యాడ్ ద్వారా ప్రేక్షకులకు సుపరిచితురాలైన యామీ గౌతమ్ కొరియర్ బాయ్ కళ్యాణ్ మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తన నటనతో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య ధర్ ను పెళ్లి చేసుకున్న యామీ గౌతమ్ పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అయింది.
మామూలుగా స్టార్‌డమ్ వచ్చి ఫేమస్ అయ్యాక ఎవరైనా తమ గురించి, తమ వ్యక్తిగత విషయాల గురించి నిరంతరం సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్, ఫాలోవర్లకు టచ్ లో ఉంటూ ఉంటారు. కానీ యామీ గౌతమ్ మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తుంది. సోషల్ మీడియా గురించి తనకు చాలా బాగా తెలుసని, తనక్కూడా సోషల్ మీడియాలో అకౌంట్స్ ఉన్నాయని, కానీ అందులో తన వ్యక్తిగత విషయాలు, అవసరం లేని విషయాలను షేర్ చేసుకోనని, అలా షేర్ చేసుకోవడం తనకు ఏ మాత్రం నచ్చదని యామీ గౌతమ్ చెప్తోంది.
తన ప్రతి విషయాన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసుకునేంత అవసరం లేదని, తన గురించి అందరూ ఆలోచించాలని తాను కోరుకోవడం లేదని, ఆడియన్స్ కు మన గురించి ఎంత తక్కువ తెలిస్తే అంత బావుంటుందని, అప్పుడే వారు తాము చేసే పాత్రలకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్సుంటుందని యామీ అంటోంది.
తనతో పాటూ తన కొడుకు విషయంలో కూడా యామీ ఇదే ఫార్ములాని పాటిస్తానని చెప్తోంది. తన కొడుకుని సోషల్ మీడియాకు దూరంగా పెంచాలని డిసైనట్టు చెప్తోన్న యామీ, ఇది పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని, తన కొడుకుని సెలబ్రిటీ కొడుకులా కాకుండా మామూలుగా పెంచాలనుకుంటున్నట్టు తను తెలిపింది. ఈ విషయంలో నెటిజన్లు కూడా తన లైఫ్ తన ఇష్టమని యామీకి మద్దతిస్తున్నారు.