రామాయణం - టాక్సిక్.. యష్ ఏమన్నారంటే..

రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమాని ఈ మధ్యనే తెరపైకి తీసుకొని వెళ్ళాడు.

Update: 2024-10-23 05:27 GMT

రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ అనే సినిమాని ఈ మధ్యనే తెరపైకి తీసుకొని వెళ్ళాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే ఈ చిత్రం తెరకెక్కుతోంది. అలాగే బాలీవుడ్ లో నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘రామాయణం’ లో కూడా యష్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతోంది.

ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల గురించి రాకింగ్ స్టార్ రీసెంట్ గా ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గీతూ మోహన్ దాస్ ఇప్పటి వరకు దర్శకురాలిగా భిన్నమైన సినిమాలు చేశారు. అయితే ఆమెకి మాస్ ఆడియన్స్ పల్స్ తెలుసు. వారు ఎలాంటి కథలు ఇష్టపడతారు అనేది అవగాహన ఉంది. దానికి తగ్గట్లుగానే ప్యూర్ మాస్ ఎంటర్టైనర్ గా ‘టాక్సిక్’ సినిమాని చేసే ప్రయత్నంలో ఉన్నాం.

కచ్చితంగా ఈ సినిమా ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఆమె ప్రతిభ కూడా అందరికి తెలుస్తుందని యష్ అన్నారు. టాక్సిక్ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అలాగే ‘రామాయణం’ లో నటించడమే కాకుండా నిర్మాణంలో కూడా భాగస్వామిగా చేరానని యష్ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆ మూవీ నిర్మాత నమిత్ మల్హోత్రాని లాస్ ఏంజిల్స్ లో కలిశానని, అప్పుడు చాలా అంశాలు చర్చించుకోవడం జరిగిందని అన్నారు.

అదే సమయంలో ‘రామాయణం’ మూవీ నిర్మాణంలో కూడా తాను భాగస్వామి అవుతానని అతనితో చెప్పానని యష్ పేర్కొన్నారు. ఈ మూవీ విజువల్ స్పెక్టక్యులర్ గా ఉంటుందని అన్నారు. ఇలాంటి కథలు స్టార్ డమ్, అభిమానుల ఇంటరెస్ట్ కి దూరంగా వెళ్లి చేయాలి. ఏం చేసిన ఫైనల్ గా ఆడియన్స్ కి నచ్చడం కోసమే మా ఈ ప్రయత్నం అని యష్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

యష్ చెప్పిన మాటలతో ఈ రెండు సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. కచ్చితంగా ‘రామాయణం’ బియాండ్ ది వరల్డ్ ఉంటుందని అనుకుంటున్నారు. అల్లు అరవింద్ కూడా ఈ ‘రామాయణం’ సిరీస్ కి నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటించారు.

Tags:    

Similar News