'యష్' టాక్సిక్.. వరల్డ్ వైడ్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా..

కేజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు కన్నడ హీరో యష్. నేషనల్ లెవెల్ లో అందరి దృష్టిని ఆకర్షించారు.

Update: 2025-02-26 09:43 GMT

కేజీఎఫ్ సినిమాలతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చారు కన్నడ హీరో యష్. నేషనల్ లెవెల్ లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు. టాక్సిక్: ఎ పెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ తో సందడి చేయనున్నారు. కన్నడతో పాటు ఇంగ్లీష్ లో ఒకేసారి సినిమాను షూట్ చేస్తున్నారు మేకర్స్.


పాపులర్‌ యాక్టర్ కమ్‌ డైరెక్టర్‌ గీతు మోహన్‌దాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను భారీ స్థాయిలో ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అలా ఒకేసారి రెండు భాషల్లో తెరకెక్కనున్న ఇండియన్ మూవీగా నిలువనుంది టాక్సిక్‌. అదే సమయంలో హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా డబ్బింగ్ చేయనున్నారు.

అదే సమయంలో సోషల్ మీడియాలో టాక్సిక్ కోసం చర్చ జరుగుతోంది. తొలి ఇండియన్ మూవీగా అరుదైన ఘనత సాధించనుందని గుర్తు చేస్తున్నారు. ప్రాంతీయ భాషకు మేకర్స్ ప్రాధాన్యం ఇస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా మూవీని రిలీజ్ చేయాలన్న ఉద్దేశం సరైనదని, ప్రపంచ ప్రేక్షకుల మధ్య అంతరాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షించాలనే మేకర్స్ లక్ష్యం.. భారతీయ సినిమా అభివృద్ధి చెందుతున్న దానికి నిదర్శనమని అంటున్నారు. అయితే కేజీఎఫ్‌ ప్రాంఛైజీ వేరే లెవెల్ హిట్ తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

దీంతో మూవీ కోసం అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే టాక్సిక్ మూవీని కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ పై వెంకట్‌ కే నారాయణ నిర్మిస్తున్నారు. యష్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కూడా నిర్మాణంలో భాగమైంది. 1970 స్‌ గోవా, కర్ణాటక బ్యాక్‌ డ్రాప్‌ లో బ్రదర్‌- సిస్టర్‌ కథతో సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.

టాక్సిక్ లో బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ ఫిమేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యుమా ఖురేషీ, తారా సుతారియా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ సీక్వెన్స్‌ లకు ప్రముఖ హాలీవుడ్‌ స్టంట్‌ మాస్టర్‌ జేజే పెర్రీ నేతృత్వం వహిస్తున్నారు. ఆయనతోపాటు పలువురు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ సినిమాకు గాను వర్క్ చేస్తున్నారు.

Tags:    

Similar News