యష్ టాక్సిక్.. స్వాగ్ లుక్ అదుర్స్..

కోలీవుడ్ యంగ్ హీరో యష్.. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే.

Update: 2025-01-08 06:28 GMT

కోలీవుడ్ యంగ్ హీరో యష్.. కేజీఎఫ్ చిత్రాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి గుర్తింపు సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఆయన.. ఇప్పుడు టాక్సిక్ మూవీలో నటిస్తున్నారు. మలయాళీ నటి, దర్శకురాలు గీతూమోహన్‌ దాస్ ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ఏ ఫెయిరీ టేల్‌ ఫర్‌ గ్రోన్‌ అప్స్‌ అనేది మూవీ ట్యాగ్‌ లైన్‌ కాగా.. ఇటీవల షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే నేడు హీరో యష్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఆయనకు స్పెషల్ విషెస్ తెలిపారు. దాంతోపాటు అదిరిపోయే గ్లింప్స్ ను టాక్సిక్: బర్త్‌ డే పీక్ అంటూ విడుదల చేశారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన గ్లింప్స్.. సినీ ప్రియులను తెగ ఆకట్టుకుంటోంది. వైట్ సూట్ వేసుకున్న యష్.. ఓ కారులో పబ్ కు వస్తారు. లైటర్ తో యమా స్టైలిష్ గా చుట్ట వెలిగిస్తారు. పబ్ లోకి స్టైలిష్ వాక్ చేసుకుంటూ వేరే లెవెల్ లుక్ తో ఆయన వెళ్లగా.. అక్కడ గ్లామరస్ డ్యాన్సులు జరుగుతుంటాయి.

అప్పుడు ఓ అమ్మాయిపై బీర్ ను పోస్తూ రొమాన్స్ చేస్తూ కనిపించారు. అయితే లాస్ట్ షాట్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు. ఫుల్ స్వాగ్ తో యష్ అదరగొట్టేశారని కొనియాడుతున్నారు. యమా స్టైలిష్ లుక్ తో మెప్పించారని.. వావ్ అని అంటున్నారు. యష్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ మూవీ పక్కా అని అంచనా వేస్తున్నారు.

అయితే తన పుట్టినరోజు నాడు ఫుల్ బిజీగా ఉంటానని, అందుబాటులో ఉండనని ఇప్పటికే యష్ సోషల్ మీడియాలో లెటర్ ను రిలీజ్ చేశారు. తనను క‌లిసి విషెస్ చెప్పాల‌ని అంతా ఆశ‌ప‌డుతుంటారని, కానీ ఈ సారి క‌ల‌వ‌లేక‌పోతున్నానని తెలిపారు. అందుకే మ‌రో రోజు క‌లుద్దామని, మీరు సేఫ్ గా ఉండ‌డ‌మే తనకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ అని తెలిపారు యష్.

ఇక టాక్సిక్ విషయానికొస్తే.. కేజీఎఫ్‌ సిరీస్‌ చిత్రాల తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ భారీ బడ్జెట్‌ తో గ్రాండ్ గా నిర్మిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను కూడా రంగంలోకి దించింది. ఏప్రిల్ 10వ తేదీన మూవీని విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.

Full View
Tags:    

Similar News