బిగ్ బాస్ 8 : ఆమె విన్నర్ అవ్వాలంటున్న యష్మి..!
నిఖిల్ వల్ల తన ఆట పోయిందన్న వాదన వినిపించిన యష్మి బయటకు వచ్చాక కూడా ఆ విషయాన్ని గట్టిగా చెప్పింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో లాస్ట్ సండే యష్మి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సీజన్ మొదట్లో తన ఫైర్ చూపించి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసిన అమ్మడు ఎందుకో మధ్యలో ట్రాక్ తప్పేసింది. టాప్ 5 కి ఉండే క్వాలిటీస్ అన్నీ ఉన్నా కూడా 12వ వారం ఎలిమినేట్ అయ్యి ఇంటి దారి పట్టింది. బిగ్ బాస్ సీజన్ 8 లో యష్మి జర్నీ ముగిసింది. బయటకు వచ్చిన ఆమె బిగ్ బజ్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు ప్రస్తావించింది.
నిఖిల్ వల్ల తన ఆట పోయిందన్న వాదన వినిపించిన యష్మి బయటకు వచ్చాక కూడా ఆ విషయాన్ని గట్టిగా చెప్పింది. ఐతే తను కూడా ఇంకాస్త ఫోకస్ గా ఉండి ఉంటే బాగుండేదని చెప్పుకొచ్చింది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ రేసులో నిఖిల్, గౌతం లు ఉండగా యష్మి మాత్రం తన ఫ్రెండ్ ప్రేరణని విన్నర్ గా చూడాలని ఉందని చెప్పింది. బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి నుంచి ప్రేరణ తన దూకుడు చూపిస్తూ వస్తుంది.
ఒక దశలో నిఖిల్ ని బీట్ చేసి ఓటింగ్ లో నంబర్ 1 వస్తుందని అనిపించేలా ఊపు తెచ్చింది. ఐతే ఎప్పుడైతే గౌతం కాత రైజ్ అవ్వడం జరిగిందో సడెన్ గా ప్రేరణ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ప్రేరణ లాస్ట్ వీక్ జస్ట్ సేఫ్ అయితే చాలు అన్నంతగా భయపడింది. మరోపక్క వీకెండ్ ఫ్యామిలీస్ పెట్టిన టాప్ 5 లో ప్రేరణ చాలా తక్కువ సార్లు రావడం కూడా ఆమె కాన్ ఫిడెన్స్ మీద దెబ్బ కొట్టింది.
సో అలా ప్రేరణ టాప్ ప్లేస్ లో ఉండాల్సిన పరిస్థితి కాస్త గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. యష్మి చెప్పినట్టుగా ప్రేరణకు కచ్చితంగా టైటిల్ గెలిచే క్వాలిటీస్ ఉన్నా కూడా నిఖిల్, గౌతం లను తట్టుకుని నిలబడటం మాత్రం కష్టమే. మరోపక్క రోహిణి ఈమధ్య తన ఆట తీరు మార్చి దూసుకెళ్తుంది. టాప్ 5 లో మొన్నటిదాకా రోహిణి పేరు లేదు కానీ ఆమె ఇప్పుడు రేసులో ఉండేలా కనిపిస్తుంది.
సో ఈసారి టాప్ 5 ఎవరు టైటిల్ విన్నర్ ఎవరన్నది చివరి వారం వరకు ఆసక్తి కొనసాగేలా ఉంది. టికెట్ టు ఫినాలే లో గెలిచి మొదట ఎవరు టాప్ 5 గా నిలుస్తారు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది.ఐతే టికెట్ టు ఫినాలే టాస్క్ లో రోహిణి కంటెండర్ గా మొదట నిలిచింది.