చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదే
కొత్త భామలకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ యువ నాయిక వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాని వాపోతుంది.
చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకునే సామెత ఒకటుంది. సరిగ్గా టాలీవుడ్ లో ఓ యంగ్ హీరోయిన్ మాటల్ని బట్టి మరోసారి ఆ సామెత స్మరించుకుంటున్నారు నెట్టింట నెటి జనులు. హీరోయిన్ గా అవకాశం రావడం అన్నది ఎంత కష్టమో ప్రయత్నాలు చేసే వాళ్లకే తెలుస్తుంది. అందులోనూ తెలుగు అమ్మాయి లకు హీరోయిన్ ఛాన్స్ అన్నది అందని ద్రాక్షగానే కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఆ ద్రాక్ష దగ్గరవుతుంది.
కొత్త భామలకి అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఓ యువ నాయిక వచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నాని వాపోతుంది. ఆ సినిమా నేను చేసి ఉంటే జీవితమే మారిపోయేదని పశ్చాతా పడతుంది. నిజమే ఆ సినిమాలో నటించిన ఆ హీరోయిన్ కి అంత గొప్ప పేరు వచ్చింది ఆ విజయంతో చాలా కొత్త అవకాశాలు అందుకుంది. ఆ ఇమేజ్ని చూసి ఛాన్స్ మిస్ చేసుకున్న నటి వాపోవడంలోనూ అర్ధముంది. కానీ ఎంత బాధపడితే? ఏం లాభం.
అవకాశం చేతిలో ఉన్నప్పుడు సద్వినియోగం చేసుకోవాలి. కాళ్లదన్నదితే ఇలాగే ఉంటుందని నెటి జనులు పోస్ట్ లు పెడుతున్నారు. ఇంతకీ ఆ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరంటే? ఆమెకి ఇండస్ట్రీ కొత్తేం కాదు. పరిశ్రమలోనే పుట్టి పెరిగింది. నటీనటు లుగా తల్లిదండ్రులకు మంచి పేరుంది. కొంత కాలంగా సినిమాలు తగ్గించినా తెలుగు పరిశ్రమలో వాళ్లకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ ఐడెంటిటీ ని కొనసాగించడం కోసం వారసురాలిగి ప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.
ఆ యువ నటి వదులుకున్న ఛాన్స్ నటిగా కొత్త జీవితాన్ని ప్రసాదించేది. కానీ సినిమాలో బోల్డ్ సీన్లు ఉన్నాయని అలాంటి వాటిలో నటించనని అందుకే వదులుకున్నట్లు తెలిపింది. క్లైమాక్స్ పార్ట్ ముందు నేరెట్ చేసి ఉంటే తప్పకుండా చేసే దాన్ని..కంటెంట్ మీద సందేహం ఉండటంతోనే అప్పుడా ప్రాజెక్ట్ చేజార్చుకున్నట్లు చెప్పింది. ఇప్పుడెంత బాధపడితే ఏం లాభం...అవకాశం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి.
ఎదిగే క్రమంలో నటిగా అన్ని రకాల సవాళ్లును స్వీకరించాలి. వాస్తవానికి ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర మరీ అంత బోల్డ్ కాదు. ఆ సీన్ లో అందమైన నటి అద్భుతంగా నటించింది కాబట్టి సీన్ అంత గొప్పగా పండింది. బోల్డ్ గా జనాల్లోకి వెళ్లింది. అందరి నటీమణులతోనూ అది సాధ్యం అవుతుందా? లేదా? అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది.