ఎన్టీఅర్ - నీల్.. క్లారిటీ ఇచ్చేశారోచ్

జూనియర్ ఎన్టీఅర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది

Update: 2023-10-05 10:55 GMT

జూనియర్ ఎన్టీఅర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్ దేవర మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది, సైఫ్ ఆలీఖాన్ పవర్ ఫుల్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు.

ఇదిలా ఉంటే ఈ మూవీని రెండు భాగాలుగా తీసుకురానున్నట్లు తాజాగా దర్శకుడు కొరటాల శివ క్లారిటీ ఇచ్చారు. పార్ట్ వన్ ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కానుందని స్పష్టం చేశారు. దేవర చిత్రం నవంబర్ కి కంప్లీట్ అయిపోతుందని తరువాత వార్ 2 మూవీ షూటింగ్ లో తారక్ జాయిన్ అవుతారని ప్రచారం జరిగింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని టాక్ వచ్చింది. అయితే ప్రశాంత్ నీల్ సలార్ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురానున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఉంది. సలార్ 2 కంప్లీట్ అయిన తర్వాత తారక్ తో ప్రశాంత్ నీల్ చిత్రం స్టార్ట్ అవుతుందనే మాట వినిపించింది. ఇప్పుడు దేవర కూడా రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్లు కొరటాల స్పష్టం చేశారు.

దీంతో ఇటు దేవర 2, అటు సలార్ 2 కంప్లీట్ అయిన తర్వాతనే ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో మూవీ సెట్స్ పైకి వెళ్తుందని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఎన్టీఅర్ ఆర్ట్స్ నుంచి ఈ సినిమాపై అధికారికంగా క్లారిటీ వచ్చింది. మైత్రీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ప్రశాంత్, తారక్ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లో స్టార్ట్ అవుతుందని ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి కన్ఫర్మ్ చేశారు. దీంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యే అవకాశం ఉందనే ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయ్యింది. కేజీఎఫ్ సిరీస్, సలార్ కి మించి తారక్ తో చేయబోయే సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

Tags:    

Similar News