మ్యాడ్ టీమ్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..!

తాజాగా, ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాని అక్టోబర్ 6వ తేదీన థియేటర్స్ లలో విడుదల చేయనున్నారు.

Update: 2023-09-25 06:46 GMT

టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం మ్యాడ్. ఆయన కాలేజీ డ్రాప్ లో నటిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్ ట్రైనర్ ఇది కావడం విశేషం. కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తీసిన సినిమా ఇది. ఈ సినిమాలో, నార్నే నితిన్ తో పాటు మరో ఇద్దరు హీరోలు కూడా ఉన్నారు. సంగీత్ శోభన్, రామ్ నితిన్ లు మరో ఇద్దరు హీరోలుగా చేస్తున్నారు. కాగా, ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యింది.


తాజాగా, ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాని అక్టోబర్ 6వ తేదీన థియేటర్స్ లలో విడుదల చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి టీజర్, పోస్టర్లు విడుదల చేశారు. అవి నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

కొద్దిరోజుల క్రితం ఈ మూవీ నుంచి ఓ పాట కూడా విడుదల చేశారు. అది సింగిల్ యాంథమ్ సాంగ్ కావడం విశేషం.'ప్రౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్' అంటూ ఈ పాట సాగింది. ఈ పాట జీవితంలో మింగిల్ కాకుండా, సింగిల్ గా సంతోషంగా, గర్వంగా ఎలా ఉండవచ్చో ప్రధాన పాత్రలకు వివరిస్తున్నట్టుగా సాగింది. పాట వింటుంటూనే ఊపచ్చి డ్యాన్స్ వేసేలా ఉండటం విశేషం.

ఈ సినిమాకు హారిక సూర్యదేవర నిర్మాతగా వ్యవహిరించనున్నారు. ప్రముఖ నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ కుమార్తె ఈ హారిక సూర్యదేవర. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సహకారంతో, ఫార్చూన్ ఫోర్ సినిమాస్‌కు చెందిన సాయి సౌజన్య కూడా ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ మూవీలో జాతిరత్నాలు ఫేమ్ డైరెక్టర్ అనుదీప్ కూడా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ మూవీలో హీరోయిన్లను కూడా చాలా కొత్తవారిని తీసుకున్నారు. గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపిక అనే ముగ్గురు అమ్మాయిలు హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. షామ్ దత్ సైనుద్దీన్, దినేష్ కృష్ణన్ బి సినిమాటోగ్రఫీ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ నవీన్ నూలి ఈ సినిమాకి ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. మరి ఈ మూవీ ఎంత వరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News