ఆ నటిని వదిలేయోమని వేడుకున్నా! యువరాజ్
ఇద్దరు కాదు..ముగ్గురు కాదు.. ఏకంగా 8 మంది అమ్మాయిలతో ప్రేమాయణం నెరిపినట్లు వార్తలొచ్చాయి.
యువరాజ్ సింగ్ మైదానంలో సిక్సులు బాదడంలోనే కాదు..యువతుల మనసులు దోచుకోవడంలోనూ మొనగాడే అనే ప్రత్యేకమైన ఇమేజ్ అతడిపై ఉంది. ఒకనొక దశలో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిపోయాడు. ఇద్దరు కాదు..ముగ్గురు కాదు.. ఏకంగా 8 మంది అమ్మాయిలతో ప్రేమాయణం నెరిపినట్లు వార్తలొచ్చాయి.
కిమ్ శర్మ, ప్రీతి జింగ్యానీ, దీపికా పదుకొణే, రియా సేన్, మినీషా లంబా, చిన్ననాటి స్నేహితురాలు అంచల్ కుమార్, నేహా ధూపియా, సోఫీ చౌదరి, ప్రీతి జింటా లతో డేటింగ్ చేసినట్లు ప్రచారంలో ఉంది. వీళ్లలో ఎంత మందితో ఎఫైర్ నడిపాడు అన్నది తెలియదు గానీ..యూవీ లిస్ట్ లో మాత్రం వీళ్లంతా ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో ప్రయివేట్ పిక్ లు అప్పట్లో నెట్టంట వైరల్ అయ్యాయి.
యూవీ ఫాంలో ఉన్న సమయంలో గాళ్స్ చిట్టా ఇదంతా. ఆ తర్వాత అందరికీ బ్రేకప్ చెప్పి హాజెల్ కీచ్‌ను వివాహం చేసుకుని స్థిరపడ్డాడు. అయితే గాళ్స్ తో డేటింగ్ లోఉన్న సమయంలో యూవీ ఆటపై అశ్రద్ద చేస్తున్నాడనే వార్తలు కూడా అప్పట్లో అభిమానుల్లో అంతే కాక పుట్టించాయి. ఈనేపథ్యంలో తాజాగా యూవీ ఓ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసి షాక్ ఇచ్చాడు. `2007-08 సమయంలో బీజీటీ కోసం అడిలైడ్ లో ఉన్నా.
అప్పుడు ఆ నటి కూడా సినిమా షూటింగ్ కోసం అక్కడికి వచ్చారు. అప్పుడే కొన్నాళ్లు నన్ను కలవొద్దు అని చెప్పా. ఆ తర్వాత బస్సులో నాతో కాన్ బెర్రాకు వచ్చింది. ఆ రెండు టెస్ట్ ల్లోనే నేను సరైన ప్రదర్శన చేయలేదు. దీంతో నన్ను వదిలేయని ఆమెను వేడుకున్నా` అని తెలిపాడు. అయితే ఆ నటి ఎవరు? అన్నది మాత్రం పేరు చెప్పలేదు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.