రామ్ కి మార్కెట్ లేదు.. కోట్లు పోగొట్టుకున్నా అంటున్న చౌదరి..!

టాలెంట్ ఎంతో ఉన్నా డైరెక్టర్ గా సక్సెస్ అవ్వని వారిలో వైవిఎస్ చౌదరి ఉంటాడు.

Update: 2024-06-11 05:30 GMT

టాలెంట్ ఎంతో ఉన్నా డైరెక్టర్ గా సక్సెస్ అవ్వని వారిలో వైవిఎస్ చౌదరి ఉంటాడు. దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో లాంటి సూపర్ హిట్ సినిమాలు ఇచ్చిన ఈ డైరెక్టర్ హిట్లు లేక కెరీర్ లో వెనకపడ్డాడు. దర్శక నిర్మాతగా వైవిఎస్ చౌదరికి మంచి క్రేజ్ ఉంది. బొమ్మరిల్లు సినిమా బ్యానర్ లో వైవిఎస్ చౌదరి సినిమాలకు ఒకప్పుడు మంచి క్రేజ్ ఉండేది కానీ వరుస ఫ్లాపుల వల్ల ఆయన వెనకపడాల్సి వచ్చింది. ఇక లేటెస్ట్ గా నందమూరి ఫ్యామిలీ నుంచి నాల్గవ తరం వారసుడిని పరిచయం చేస్తూ సినిమా చేస్తున్నారు వైవిఎస్ చౌదరి.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ లో భాగంగా వైవిఎస్ చౌదరి లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చారు. ఈ ప్రెస్ మీట్ లో షాకింగ్ విషయాలను వెల్లడించారు వైవిఎస్ చౌదరి. ముఖ్యంగా దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలు స్కేలబిలిటీ లేకపోయినా సరే రిస్క్ తీసుకుని మరీ చేసినట్టు చెప్పుకొచ్చారు. రామ్ కి మార్కెట్ లేకపోయినా దేవదాస్ సినిమా మంచి బడ్జెట్ తో తీశాం. ఆ సినిమా ఫస్ట్ డే 10 కోట్లు లాస్.. జనవరి 11న రిలీజైతే పోటీగా స్టైల్, లక్ష్మి, చుక్కలో చంద్రుడు సినిమాలు వచ్చాయి. నాలుగు వారాల పాటు ఆ సినిమా బాగా ఆడుతుందని తానే వాయిస్ ఓవర్ ఇచ్చి ప్రమోట్ చేశా.

ఆ తర్వాత సినిమా సిల్వర్ జూబ్లీ ఆడింది. దేవదాస్ రిలీజ్ టైం లో రామ్ కి అసలేమాత్రం మార్కెట్ లేదని చెప్పారు వైవిఎస్ చౌదరి. ఇది రామ్ ని తక్కువ చేయడం కాదని అన్నారు. లాహిరి లాహిరి లాహిరిలో సినిమా టైం లో కూడా హరికృష్ణ, భానుప్రియ, సుమన్, రచన, వినీత్, సంఘవి వీళ్లందరికీ మార్కెట్ లేదు ఆదిత్య ఓం, అంకిత లీడ్ పెయిర్. అయినా కూడా ఆ టైం లో 3 కోట్ల పైన సినిమా తీశా సినిమా విషయంలో తాను నమ్మిన దాన్ని ఫాలో అవుతానని.. ఎన్నోసార్లు సినిమా రిలీజ్ టైం లో తన ఆస్తులు, ఇంట్లో నగలు అన్ని స్టేక్ లో పెట్టినట్టు చెప్పుకొచ్చారు వైవిఎస్ చౌదరి.

ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీయాలన్న తపన దర్శకులకు ఎలా ఉంటుందో తెలిసిందే. వైవిఎస్ చౌదరి విషయంలో దర్శకుడే కాదు నిర్మాత కూడా ఆయనే కాబట్టి తను ఎంత ఖర్చు పెట్టాలన్నా పెట్టేస్తాడు. అలా తను తీసిన దేవదాస్, లాహిరి లాహిరి లాహిరిలో సినిమాల వెనుక తన కష్టాన్ని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు వైవిఎస్ చౌదరి. తను చేయబోతున్న కొత్త సినిమా కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నట్టు తెలుస్తుంది.

Tags:    

Similar News