2025 ఆ ఓటీటీ నామ సంవత్సరమా?
అయితే గత రెండేళ్లగా జీ స్టూడియోస్ మాత్రం ఈ రేసులో బాగా వెనుకబడింది. వాటితో పోల్చితే? అసలు పోటీలా ఉందా? అన్న సందేహం కూడా కలుగుతుంది.
అమెజాన్ ప్రైమ్, నెట్ ప్లిక్స్ , డిస్నీ హాట్ స్టార్ సహా ప్రఖ్యాత డిజిటిల్ మాధ్యమాల మధ్య పోటీ ఎలా ఉంది? అన్నది చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ కొనుగోలు విషయంలో దేనికది ప్రత్యేతను చాటుతున్నాయి. ఎవరి స్ట్రాటజీ వారు మార్కెట్ లో దూసుకుపోతున్నారు. అయితే గత రెండేళ్లగా జీ స్టూడియోస్ మాత్రం ఈ రేసులో బాగా వెనుకబడింది. వాటితో పోల్చితే? అసలు పోటీలా ఉందా? అన్న సందేహం కూడా కలుగుతుంది.
ఈ రెండేళ్లలో జీ స్టూడియోస్ డిజిటల్ బిజినెస్ లో కాస్త వెనుకబడినట్లే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇతర ప్రఖ్యాత డిజిటల్ మాధ్యాలతో విలీన ఒప్పందం దిశంగానూ అడుగులు వేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త చిత్రాలు కొనుగోలు విషయంలోనూ పరిమితులతో ముందుకెళ్తుంది. అయితే 2025 తెలుగు చిత్రాల విషయానికి వస్తే జీస్టూడియోస్ నామ సంవత్సరంగా మారేలా ఉంది. జీ స్టూడియెస్ రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` లో భాగస్వాములుగా ఉన్నారు.
ఒప్పందం ప్రకారం ఆ సంస్థకు సినిమా ప్లాప్ తో సంబంధం లేకుండా మంచి లాభాలొచ్చాయి. అలాగే `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా రైట్స్ ను కూడా జీనే సొంతం చేసుకుంది. ఓటీటీ సహా శాటిలైట్ రైట్స్ వాళ్ల చేతుల్లోనే ఉన్నాయి. `సంక్రాంతికి వస్తున్నాం` సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే సందీప్ కిషన్ నటిస్తోన్న `మజాకా` నాన్-థియేట్రికల్ హక్కులను కూడా జీ స్టూడియోస్ కొనుగోలు చేసింది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `విశ్వంబర` డిజిటల్ - శాటిలైట్ హక్కుల కోసం కూడా జీ స్టూడియోస్ చర్చలు జరుపుతోంది. ఇంకా అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించే చిత్రాలను కూడా వారు కొనుగోలు చేస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తోన్న `తమ్ముడు` చిత్రం కూడా జీదేనని ప్రచారంలో ఉంది. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నితిన్ తో నిర్మిస్తోన్న `రాబిన్‌హుడ్` కోసం చర్చలు జరుపుతోంది. ఇంకా మరిన్ని అగ్ర నిర్మాణ సంస్థలతో జీ టచ్ లో ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ ఏడాది జీకి బాగానే కలిసొచ్చేలా ఉంది.