జాంబి రెడ్డి 2.. ట్విస్టులే టిస్టులు..!

ఐతే ఈ సీక్వెల్ లో తేజ సజ్జా హీరోగా నటిస్తాడు కానీ డైరెక్టర్ గా సుపర్న్ వర్మ చేస్తాడని తెలుస్తుంది.;

Update: 2025-04-15 17:54 GMT
జాంబి రెడ్డి 2.. ట్విస్టులే టిస్టులు..!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకడైన ప్రశాంత్ వర్మ సినిమా సినిమాకు తన సత్తా ఏంటన్నది చూపిస్తున్నాడు. అ! తో మొదలైన అతని దర్శకత్వ ప్రతిభ జాంబి రెడ్డి, కల్కి, హనుమాన్ ఇలా రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు. ప్రశాంత్ వర్మ క్రియేటివిటీకి మొదటి మొదటి తార్కాణంగా నిలిచింది అ! సినిమా అయితే అతను జాంబి కాన్సెప్ట్ తో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమా జాంబి రెడ్డి కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. అతను చేసిన ఈ అటెంప్ట్ దర్శకుడిగా తన స్టామినా ప్రూవ్ చేసింది.

ఇక హనూమాన్ తో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఐతే జాంబి రెడ్డి చూసిన ఆడియన్స్ ఆ సినిమా సీక్వెల్ కోసం ఆసక్తి చూపిస్తున్నారు. ఐతే ప్రశాంత్ వర్మ వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతను కమిటైన సినిమాలు చేయడానికే ఎలా లేదన్నా మూడు నాలుగేళ్లు పట్టేలా ఉంది. ఈ టైం లో జాంబి రెడ్డి 2 అంటే చాలా కష్టమే.

ఐతే ఈమధ్య ప్రశాంత్ వర్మ తను తీయలేని సినిమాలు అంటే తను కథలు అందించి వేరే వాళ్లని డైరెక్ట్ చేయమంటున్నాడు. ఈమధ్యనే దేవకి నందన వాసుదేవ సినిమా తన కథతోనే వచ్చింది. ఐతే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇదిలాఉంటే ప్రశాంత్ వర్మ డైర్క్షన్ లో వచ్చిన జాంబి రెడ్డి సీక్వెల్ ని కూడా అదే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రశాంత్ వర్మ టీం ఆధ్వర్యంలోనే జాంబి రెడ్డి 2 ప్లాన్ చేస్తున్నారట.

ఐతే ఈ సీక్వెల్ లో తేజ సజ్జా హీరోగా నటిస్తాడు కానీ డైరెక్టర్ గా సుపర్న్ వర్మ చేస్తాడని తెలుస్తుంది. రానా నాయుడు సీరీస్ తో డైరెక్టర్ గా సక్సెస్ అయిన సుపర్న్ జాంబి రెడ్డి 2 తో అదరగొట్టబోతున్నాడు. ఐతే ఈ సినిమా మరి ఆశించిన స్థాయిలో ఉంటుందా లేదా అన్నది చూడాలి.

హనుమాన్ తర్వాత తేజా సజ్జా మిరాయ్ తో రాబోతున్నాడు. తన కెరీర్ లో మొదటి కమర్షియల్ సక్సెస్ అయిన జాంబి రెడ్డి సీక్వెల్ సినిమాను తేజా మరో దర్శకుడితో చేయడం కాస్త కొత్తగా అనిపించినా వర్క్ అవుట్ అయితే మాత్రం సూపర్ అనిపించేస్తుందని చెప్పొచ్చు.

Tags:    

Similar News