పానీపూరీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్... రాష్ట్ర వ్యాప్తంగా బ్యాన్!!
"పానీపూరీ" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉంటుందని చెబుతుంటారు.
"పానీపూరీ" గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి సెపరేట్ ఫ్యాన్ బెల్ట్ ఉంటుందని చెబుతుంటారు. ప్రధానంగా.. సాయంత్రం స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులు వదిలిన తర్వాత ఆ బండి చుట్టూ మూగి.. ఎంతో ఇష్టంగా తింటుంటారు. మధ్య మధ్యలో ఎగస్ట్రా గార్నిష్, ఫ్లేవర్స్ ని కోరుకుంటూ ఉంటారు!
మరోపక్క... ఆ పానీపూరీలో వేసే పానీని చూసి కొంతమంది చికాకు పడుతుంటారు. వాటి కోసం ఏ నీళ్లు వాడుతున్నారో అని ఆందోళన చెందుతుంటారు. ఇంకొంతమంది ఆ పరిసరాలను చూసి కంగారు పడుతుంటారు. ఈ క్రమంలో ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక సర్కార్ చాలా స్ట్రిక్ గా వ్యవహరిస్తోందని అంటున్నారు.
ఆహార నాణ్యత విషయంలో కర్ణాటక ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా వ్యవహరిస్తోందని అంటున్నారు.. ఇటీవల క్యాబేజీ మంచూరియాలో కృత్రిమ రంగులు, రసాయనాల వాడకాన్ని ఇప్పటికే నిషేధం విధించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో... తాజాగా "పానీపూరి" విషయంలో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా వెళ్తోందని అంటున్నారు.
అవును... చాలా మంది ఫేవరెట్ అయిన "పానీపూరి"ని నిషేధించే దిశగా కర్ణాటక ప్రభుత్వం వెళ్తోందని తెలుస్తోంది. కర్ణాటకలో బహిరంగ ప్రదేశాలు, మాల్స్ లో ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ని అందుబాటులోకి తెచ్చిన ఆ రాష్ట్ర ఆహార భద్రతా విభాగం.. నాణ్యత లేని ఆహార పదార్ధాలను గుర్తించేందుకు తనిఖీలను ముమ్మరం చేసింది.
ఈ క్రమంలో ఇప్పటికే బెంగళూరు వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి పానీపూరీ శాంపిల్స్ ని సేకరించి పరీక్షిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగా సుమారు 200 కు పైగా శాంపిల్స్ ని సేకరించి పరీక్షలకు పంపినట్లు చెబుతున్నారు. పానీ పూరిలో వాడే పూరి తయారీ నుంచి, ఆ పానీ ప్రిపరేషన్ వరకూ ప్రతీ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.