టమాటా దెబ్బకు వెజ్ థాలి పెరిగిపోయింది

అందునా పెరిగిన టమాటా ధరతో థాలి ధరలు పెంచినట్లుగా క్రిసిల్ తాజా రిపోర్టు పేర్కొంది.

Update: 2024-08-07 06:11 GMT

శాఖాహారులకు బ్యాడ్ న్యూస్. వారు తినే శాఖాహార భోజనం ధర పెరిగింది. వెజ్ థాలి తయారీలో కీలకమైన కూరగాయల ధరలు పెరగటం.. అందునా పెరిగిన టమాటా ధరతో థాలి ధరలు పెంచినట్లుగా క్రిసిల్ తాజా రిపోర్టు పేర్కొంది. జూన్ తో పోలిస్తే జులైలో వెజ్ థాలి తయారీ ధరలు పెరిగాయని.. ఇది 11 శాతం వరకు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. వెజ్ థాలితో పోలిస్తే నాన్ వెజ్ థాలి తయారీ ధర 6 శాతం పెరిగినట్లు చెబుతున్నారు.

అన్నం.. కూరగాయలు.. రోటి.. పెరుగు.. సలాడ్ తో ఉండే వెజ్ థాలి ప్లేట్ సగటు ధర రూ.29.4 ఉంటే.. జులైలో రూ.32.60కు పెరిగినట్లుగా రిపోర్టు పేర్కొంది. ఈ పెరిగిన ధరల్లో టమాటా ధర పెరగటమే కారణమని.. ఒక్క టమాటా ధర ఏడు శాతం పెరిగిందని పేర్కొన్నారు. వెజ్ థాలిలో అన్నం.. ఉల్లి.. టమాటా.. బంగాళదుంపలతో కూరను ఇస్తుంటారు. కూరగాయల ధరల కారణంగా తయారీ ధర పెరిగింది.

వెజ్ థాలితో పోలిస్తే నాన్ వెజ్ థాలి తయారీ ధర తక్కువగా ఉంది. కారణం.. వెజ్ థాలిలో కూర ఉంటే.. నాన్ వెజ్ థాలిలో పప్పు, కూరకు బదులుగా కోడి మాంసాన్ని ఇస్తారు. కూరగాయల ధరలతో పోలిస్తే బ్రాయిలర్ చికెన్ ధర 6 శాతమే పెరిగింది. జులైలో ఈ ఖర్చు రూ.61.4కు పెరిగింది.

ఈ ఏడాది మేలో రూ.55.90గా ఉందని రిపోర్టు వెల్లడించింది. 2023 జులైతో పోలిస్తే వెజ్ థాలి ధరలు తగ్గినట్లుగా పేర్కొన్నారు. దీనికి కారణం 2023 జులైలో కేజీ టమాటా రూ110గా ఉండటమే. ఇప్పుడు కేజీ రూ.66గా ఉంది. ఏమైనా కూరగాయల ధరలు థాలి తయారీ ఖర్చుల్ని పెంచుతున్నాయి.

Tags:    

Similar News