30 ఏళ్లలో టైప్ 2 షుగర్.. ఎంత డేంజరో చెప్పిన రిపోర్టు!
టైప్ 2 మధుమేహం బారిన పడితే.. సగటు జీవితకాలం పద్నాలుగేళ్ల వరకు క్షీణిస్తుందని తాజా నివేదిక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది.
వచ్చే వరకు తెలీకుండా వచ్చేసి.. ప్రాణాలు తోడేసే మాయదారి రోగాల్లో షుగర్ వ్యాధి ఒకటి. రోజులు గడుస్తున్న కొద్దీ.. షుగర్ బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. టైప్ 2 మధుమేహం బారిన పడిన వారి జీవితకాలం ఎంతలా తగ్గుతుందన్న షాకింగ్ నిజాల్ని వెల్లడించింది లాన్సెట్ తాజా రిపోర్టు.
టైప్ 2 మధుమేహం బారిన పడినోళ్లు ముఖ్యంగా గుండెపోటు.. పక్షవాతం. మూత్రపిండాల సమస్యలతో పాటు.. క్యాన్సర్ కు కారణమయ్యే పరిస్థితులు ఉన్నట్లుగా పేర్కొన్నారు.
టైప్ 2 మధుమేహం బారిన పడితే.. సగటు జీవితకాలం పద్నాలుగేళ్ల వరకు క్షీణిస్తుందని తాజా నివేదిక షాకింగ్ నిజాన్ని వెల్లడించింది. 40 ఏళ్ల వయసులో దీని బారిన పడితే పదేళ్లు.. యాభైఏళ్ల వయసులో వస్తే కనీసం ఆరేళ్లు ముందుగా మరణించే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. అధిక ఆదాయం ఉన్న పందొమ్మిది దేశాల్లోని 15 లక్షల మంది ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించటం ద్వారా ఈ అంశాల్ని వెల్లడిస్తున్నట్లు చెబుతున్నారు.
టైప్ 2 షుగర్ ఉచ్చులో పడకుండా ఉండేందుకు వీలుగా మార్పులు చేసుకోవాలని.. నాణ్యత లేని ఆహారం.. ఉబకాయం.. అధిక సమయం కూర్చొని ఉండటం.. శారీరక వ్యాయామం లేకపోవటం కూడా టైప్ 2 మధుమేహం బారిన పడేందుకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
దీని బారిన పడుతున్న యువత సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న వేళ.. టైప్ 2 షుగర్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని పక్కా పాటించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు. బీకేఆర్ ఫుల్.