మగవారిలో వీర్యకణాల నాణ్యతను పెంచే ఆహారాలు ఇవే!

ఈ సమయంలో వీర్య కణాల నాణ్యతను పెంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

Update: 2024-08-16 12:30 GMT

ఇటీవల కాలంలో మారుతున్న జీవన శైలి, సరైన పోషకాహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, అధిక ఒత్తిడి... కారణాలు ఏవైనా మగవారిలో సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుందనే మాటలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వీర్య కణాల నాణ్యతను పెంచడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది.

అవును... వీర్య కణాల నాణ్యతను పెరగడానికి ఆరోగ్యకరమైన ఆహారం చాలా కీలకపాత్ర పోషిస్తుంది. అయితే... వీర్య నాణ్యతను పెంచే ఓకే ఒక్క ఆహారం అంటూ ప్రత్యేకంగా లేదు కానీ... పోషకాలతో సమృద్ధిగా ఉండే వివిధ రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి ఏమిటనేది ఇప్పుడు చూద్దాం...!

విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే నారింజలు, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీ వంటి పండ్లు వీర్య నాణ్యతను మెరుగుపడడానికి సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇదే సమయంలో కాలీఫ్లవర్ లో విటమిన్ సీ తో పాటు ఫైబర్ అధికంగా ఉంటుంది, పాలకూరలో ఐరన్, ఫోలెట్ అధికంగా ఉంటాయి. ఇవి శుక్రకణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

ఇదే క్రమంలో... విటమిన్ ‘ఇ’ అధికంగా ఉండే బాదం, అవోకాడో, వాల్ నట్స్ వంటి ఆహారాలు వీర్య నాణ్యతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తాయి. అదేవిధంగా గుమ్మడికాయ గింజలు, ఆవాలు, రెడ్ మీట్ వంటి జింక్ కలిగిన ఆహారాలు కూడా శుక్రకణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

కాల్షియం, విటమిన్ ‘డి’ అధికంగా ఉండే పాల ఉత్పత్తులను తీసుకోవడం మంచింది. ఇక మాంసం, చేప, గుడ్లు, కాయాధాన్యాలు, బీన్స్ వంటి ఆహారాలు వీర్య ఉత్పత్తికి అవసరమైన ప్రోటీనలు అందిస్తాయి. ఇవి శుక్రకణాల ఉత్పత్తికి ఎంతో సహాయపడతాయి. ఇలాంటి సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ... యోగా, ధ్యానం వంటివి చేస్తే మంచింది.

అదేవిధంగా... వారానికి కనీసం 150 నుంచి 200 నిమిషాలపాటు మధ్యస్థ తీవ్రత కలిగిన వ్యాయామం చేయడం మంచింది! అవి తింటూ, ఇవి చేస్తూ... మద్యపానం, ధూమపానం వంటివాటికి దూరంగా ఉండాలి. శుక్రకణాలు దెబ్బతినడంలో ఈ రెండు అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయని వైద్యులు చెబుతున్నారు!

Tags:    

Similar News