షుగర్ పేషెంట్స్ కి గుడ్ న్యూస్... ఆ మొక్క బీహార్ లో దొరికింది!
ప్రధానంగా నోరూరించే స్వీట్లు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు ఈ వ్యాధి నోరు కట్టేస్తుంటుంటే కలిగే బాధ వర్ణాణాతీతం అని అంటారు.
ఈ రోజుల్లో ఉన్న అతిపెద్ద అనారోగ్యాల్లో మధుమేహం ఒకటనే సంగతి తెలిసిందే. ఈ వ్యాధి బారిన పడిన వారి కష్టాలు అనుభవిస్తేనే తెలుస్తాయని అంటుంటారు. ప్రధానంగా నోరూరించే స్వీట్లు కళ్లముందు కనిపిస్తున్నప్పుడు ఈ వ్యాధి నోరు కట్టేస్తుంటుంటే కలిగే బాధ వర్ణాణాతీతం అని అంటారు. అయితే ఈ సమయంలో ఆ శాస్త్రవేత్తలు ఓ గుడ్ న్యూస్ చెప్పారు.
అవును... మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఓ గుడ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ మధుమేహం ఉన్నవారికి ఎదురయ్యే ప్రధాన సమస్య తీపి పదార్థాలు చూనప్పుడు నోరు ఊరిపోవడం, గుటకలు వేయడం, వాటిని ఎవరూ చూడకపోతే ఓ పట్టుపట్టేయాలనుకోవడం! అయితే... తాజాగా శాస్త్రవేత్తలు కనుగొన్న ఓ ఔషద మొక్క వల్ల తీపి పదార్థాలను తినాలన్న ఆకాంక్ష తగ్గిపోతుందంట.
వివరాళ్లోకి వెళ్తే... బీహార్ లోని గయాలో ఉన్న బ్రహ్మయొని అనే పర్వతంపై అనేకరకాల ఔషధ మొక్కలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాటిలో గుర్మార్ అనే మొక్క కూడా ఉందంట. ఈ మొక్కకు మధుమేహాన్ని తగ్గించే లక్షణం ఉంటుందని చెబుతున్నారు. ఈ వ్యాధి చికిత్స కోసం బీజీఆర్-34 అనే ఔషధ తయారీకి పరిశోధకులు గుర్మార్ ను ఉపయోగిస్తున్నారని అంటున్నారు.
ఈ మొక్కలో జిమ్నెమిక్ యాసిడ్ ఉంటుందట. ఇది పేగుల్లోని పొరపై ఉండే గ్రాహక ప్రదేశాలను నింపేస్తుందని.. తద్వారా స్వీట్లు తినాలన్న కోరికను తగ్గించేస్తుందని అంటున్నారు. ఫలితంగా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గడానికి ఇది దోహదపడుతుందని శాస్త్రవేతాలు చెబుతున్నారు. దీంతో... ఈ మొక్క కచ్చితంగా షుగర్ పేషెంట్స్ కి గుడ్ న్యూస్ అని అంటున్నారు.