ధూమపానం మానేస్తే... గంటల్లో, రోజుల్లో, నెలల్లో వచ్చే మార్పులివే!
సరదా కోసమో, స్టైల్ కోసమో అలవాటైన ధూమపానం నిజంగా మానేయాలనుకున్నప్పుడు చాలా కష్టం అని అంటుంటారు అనుభవజ్ఞులు!
సరదా కోసమో, స్టైల్ కోసమో అలవాటైన ధూమపానం నిజంగా మానేయాలనుకున్నప్పుడు చాలా కష్టం అని అంటుంటారు అనుభవజ్ఞులు! మానెయ్యండి అని చెప్పినంత ఈజీ కాదు ఈ అలవాటు నుంచి బయటపడటం అని చెబుతుంటారు! కానీ... మనసుంటే మార్గం ఉంటుంది, మానాలని దృఢంగా నిర్ణయించుకుంటే మానేయడం ఏమీ అత కష్టం కాదని అంటుంటారు నిపుణులు!
అవును... ధూమపానం అలవాటు చేసుకోవడం ఎంత సులువో, మానేయడం అంత కష్టం అని అంటుంటారు. కానీ... నిజంగా ఈ అలవాటు నుంచి బయటపడినవారు మాత్రం ఆ మార్పును స్పష్టంగా అనుభవిస్తుంటారు. మానసికంగానూ, శారీరకంగానూ ఎంతో మార్పును ఎక్స్ పీరియన్స్ చేయడంతో పాటు.. సరికొత్త లైఫ్ లోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుందని చెబుతుంటారు.
వాస్తవానికి ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్స్ మంది ఈ ధూమపానానికి అలవాటైపోయారు. తక్కువమంది మానాలని ప్రయత్నిస్తుంటారు. అతి కొద్ది మాత్రం ఆ అలవాటును మానేస్టుంటారు. ఈ సమయంలో ధూమపానం అలవాటును వదులుకోవడం వల్ల శరీరంలో కలిగే మార్పులు ఎన్నో ఉంటాయి. అవి ఏమిటనేది ఇప్పుడు చూద్దాం..!
ధూమపానం మానేసిన 20 నిమిషాల్లో బ్లడ్ ప్రెసర్ (బీపీ) సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇదే క్రమంలో పల్స్ రేటూ నార్మల్ అయిపోతుంది. అదేవిధంగా కాళ్లు, చేతులు, బాడీ టెంపరేచర్ నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. ఇక స్మోకింగ్ మానేసిన 12 గంటల తర్వాత రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయి సాదారణ స్థితికి వచ్చేస్తుంది. గుండెకు, ఇతర భాగాలకు మరింత ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఇదంతా 12 గంటల్లోనే జరిగిపోతుంది.
ఇక ధూమపానం మానేసిన 24 గంటల్లో హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గగా.. 48 గంటల్లో నర్వ్ ఎండింగ్స్ తిరిగి అభివృద్ధి చెందుతాయి. ఇదే క్రమంలో... తీపి, ఉప్పు తదితర రుచులను ఆస్వాధించే విధానం మరుతుంది.. రుచి బాగా తెలుస్తుంది! ఇక 72 గంటల్లో బ్రాంకియల్ ట్యూబ్స్ రిలాక్స్ అవ్వడంతోపాటూ సులబంగా శ్వాస తీసుకోవచ్చు. ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతుంది.
ఇక స్మోకింగ్ మానేసిన రెండు వారాల నుంచి మూడు నెలల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నడవడం సులువవుతుంది. లంగ్స్ ఫంక్షనింగ్ 30 శాతం మెరుగుపడుతుంది. ఇదే సమయంలో ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. లంగ్స్ లో సీలియా మళ్లీ పెరుగుతుంది. ఫలితంగా ఊపిరితిత్తులు శుభ్రంగా ఉండి, ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతుంది. అదే విధంగా మ్యూకస్ ని హ్యాండిల్ చేసే సామర్థ్యం పెరుగుతుంది.
ఇలా శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదే క్రమంలో... దూమపానం మానేసిన కొన్ని నెలల తర్వాత అంగస్తంభన సమస్య నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ధూమపానం మానేసిన తర్వాత ఏడాది లోపు ప్రారంభంలో 10 - 15 నిమిషాలు నడవడానికి ఇబ్బంది పడేవారి సమస్య తగ్గుతుంది.. ఆయాసం తగ్గుతుంది. ఇక ధూమపానం మానేసిన నాలుగేళ్ల తర్వాత అసలు ఆ అలవాటు లేని వ్యక్తిలా మారిపోతారు!