భారతీయులకు ముంచుకొస్తోన్న కొత్త సమస్య!

తాజాగా ఓ ఆసక్తికరమైన నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికను వెల్లడించింది.;

Update: 2025-03-01 03:00 GMT

తాజాగా ఓ ఆసక్తికరమైన నివేదిక తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... గ్లోబల్ స్లీప్ సర్వే తన ఐదో వార్షిక నివేదికను వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చేసిన ఈ సర్వే గురించి వెల్లడిస్తూ.. భారతీయులకు కొత్త సమస్య ముంచుకొస్తోందని తెలిపింది. అదే నిద్ర సంక్షోభం. ఇప్పటికే భారతీయులు వారంలో మూడు రోజులు సరిగా నిద్రపోవడం లేదని సర్వే తెలిపింది!

అవును... భారతీయులు సరిగా నిద్రపోవడం లేదంట. ఈ నేపథ్యంలో వారికి నిద్ర సంక్షోభం ముంచుకొస్తోందని గ్లోబల్ స్లీప్ సర్వే వెల్లడించింది. ఈ సమయంలో ప్రతీ వారంలోనూ కనీసం మూడు రోజులు భారతీయులు నిద్రను కోల్పోతున్నట్లు తెలిపింది. చాలా మంది ఇప్పటికే ఈ సమస్యతో భాదపడుతున్నప్పటికీ ఎలాంటి వైద్య సహాయం పొందడం లేదని వెల్లడించింది!

ఈ సందర్భంగా... భారతీయుల్లో 49 శాతం మంది వారానికి కనీసం మూడు రోజులు నిద్రపోవడంలో ఇబ్బందులు పడుతున్నారని.. 47 శాతం మంది భారతీయులు నిద్ర లేమి కారణంగా వచ్చే అలసట కారణంగా తమ తమ కేరీర్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఫలితంగా తమ కెరీర్ ఎదుగుదలలో దీని ప్రభావాన్ని చవిచూస్తున్నారని చెబుతున్నారు!

ఇదే సమయంలో.. పురుషులతో పోలిస్తే స్త్రీలు తక్కువ నాణ్యమైన నిద్రను అనుభవిస్తున్నరని.. పురుషులతో పోలిస్తే మహిళలు వారంలో తక్కువ రాత్రులు మంచి నిద్ర పొందుతున్నారని.. స్త్రీల రుతుచక్రంపై నిద్ర తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నట్లు సర్వేలో తేలిందని తెలిపింది. పురుషులతో పోలిస్తే స్త్రీలు ఐదు శాతం ఎక్కువగా సిక్ లీవ్ లు తీసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ సర్వే కోసం అమెరికా, చైనా, భారత్ లలో 5,000 మంది.. జర్మనీలో 2004, ఫ్రాన్స్ లో 2001, యూకే 2000, థాయిలాండ్ లో 1519, ఆస్ట్రేలియాలో 1501.. జపాన్, కొరియాల్లో ఒక్కో దేశంలోనూ 1500 మందితో పాటు హాంకాంగ్ లో 1001, న్యూజిలాండ్ 1000, సింగపూర్ లో 1000 మంది కలిపి మొత్తం 30,026 మందిపై ఈ సర్వే నిర్వహించినట్లు తెలిపారు!

Tags:    

Similar News