మీరు డబ్బున్న వారా?.. అయితే.. జబ్బున్నవారు కూడా..

తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలోనూ అదే నిజమని తేలింది.

Update: 2024-06-03 15:30 GMT

మీరు ధనవంతులా..? అయితే ఈ వ్యాధి రావొచ్చంటున్నారు సైంటిస్టులు. ఆయనకేం.. ‘డబ్బున్న మహారాజు’ అని అంటూ ఉంటారు కొందరిని.. కానీ, ఇకమీదర జబ్బున్న మహారాజు అని కూడా అనాలేమో? గతంలో ధనవంతులకే పెద్ద వ్యాధులు వస్తాయని.. వారి అలవాట్లు.. శారీరక శ్రమ లోపం దీనికి కారణమని భావించేవారు. అయినా, డబ్బుతో వైద్యం కొనొచ్చని, కావాల్సిన ఆహారం తెప్పించుకుని, వ్యాధిని నయం చేసుకుంటారని చెప్పేవారు. తాజాగా శాస్త్రవేత్తల పరిశోధనలోనూ అదే నిజమని తేలింది.

రాచ(రిక) పుండు

వ్యాధుల్లో కెల్లా తీవ్రమైనది కావడంతో క్యాన్సర్ ను మనం అంతా రాచపుండు అంటూ ఉంటాం. గతంలో ఈ వ్యాధి వచ్చినవారు జీవించే అవకాశం తక్కువగా ఉండేది. రానురాను వైద్యం మెరుగవడంతో క్యాన్సర్ బాధితులు కోలుకునే అవకాశాలు పెరిగాయి. కాగా, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పు ఎవరికి అధికమో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలోని హెల్సింకీ వర్సిటీ శాస్త్రవేత్తలు.

డబ్బుకు.. జబ్బుకు లింకు..

క్యాన్సర్ పేదల కంటే డబ్బున్నవారికే వచ్చే అవకాశాలు ఎక్కువని హెల్సింకీ వైద్యులు తేల్చారు. రొమ్ము, ప్రొస్టేట్‌ వంటి ఇతర రకాల క్యాన్సర్లు వచ్చే జన్యుపరమైన ప్రమాదం ఎక్కవగా ఉందని పరిశోధన పేర్కొంది. కాగా, సంపాదన తక్కువగా ఉన్నవారు కుంగుబాటుకు గురై ఆల్కహాల్‌ కు బానిసవ్వడంతో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ తో పాటు మధుమేహం, ఆర్థరైటిస్‌ వంటివి జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు బాగా డబ్బు సంపాదించే, సంపన్న దేశాల్లో సర్వసాధారణంగా వచ్చే 19 వ్యాధుల గురించి పేర్కొంది. ఉన్నత విద్యావంతులైన మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ కు సంబంధించిన జన్యు ప్రమాదంపై ముందుగానే వైద్యులను సంప్రదించడం, చికిత్స తీసుకోవడం చేస్తారు. తక్కువ జన్యు ప్రమాదం లేదా తక్కువ విద్య ఉన్న మహిళల కంటే వీరే అధికంగా ఆస్పత్రులకు వెళ్తారు.

పరిశోధన ఇలా..

శాస్త్రవేత్తల బృందం 80 ఏళ్ల వయసుగల 2 లక్షలకు పైగా ఫిన్లాండ్‌ పౌరుల ఆరోగ్య డేటా తీసుకుని.. వారి సామాజిక పరిస్థితితో లింక్‌అప్‌ అయ్యి ఉన్న జన్యుసంబంధాన్ని ట్రాక్‌ చేశారు. వ్యాధుల ప్రమాదంలో స్త్రీ, పురుష మధ్య చాలా తేడా ఉందని, ఇది వయసు మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. వ్యాధి ప్రమాదానికి సంబధించిన జన్యు అంచనా అనేది సామాజిక ఆర్థిక నేపథ్యంపై ఆధారపడి ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది.

వ్యక్తి జన్యు సమాచారం శాశ్వతంగా ఉంటుంది. వయసు రీత్యా లేదా పరిస్థితులు మారితే వచ్చే వ్యాధుల ప్రమాదం కారణంగా జన్యు ప్రభావం మారుతుంది. శాస్త్రవేత్తలు నిర్దిష్ట వృత్తితో లింక్‌ అయ్యే వ్యాధి ప్రమాదాల గురించి అర్థం చేసుకోవడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు

Tags:    

Similar News