ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటి...? బయటపడటం ఎలా...?

ఈ విషయంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆన్ లైన్ సెర్చ్ పెరుగుతుందని అంటున్నారు.

Update: 2024-05-15 08:53 GMT

ఇటీవల కాలంలో రకరకాల సిండ్రోమ్ లు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్ విసృతంగా వాడుకలోకి వచ్చిన తర్వాత.. కొన్ని క్లిక్‌ లతో దాదాపు ఏ అంశాన్ని అయిన పరిశోధించడానికి అనుమతిస్తుంది. ఈ విషయంలో ప్రధానంగా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఆన్ లైన్ సెర్చ్ పెరుగుతుందని అంటున్నారు. ఇది ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

అవును... ఇడియట్ అంటే "ఇంటర్నెట్ డెరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్‌ స్ట్రక్టింగ్ ట్రీట్‌ మెంట్" అని అర్ధం. దీని ప్రకారం... ప్రజలు ఆన్‌ లైన్‌ లో అందుబాటులో ఉన్న అన్ని వైద్య సమాచారాన్ని గుడ్డిగా విశ్వసించడం.. వైద్యుడిని సంప్రదించకుండా వారి చికిత్సను అకస్మాత్తుగా ఆపివేయడం చేస్తుంటారు. తాజాగా... నేషనల్ ఇన్‌ స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ జర్నల్ క్యూరియస్‌ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ఈ సమస్యను హైలైట్ చేస్తుంది.

సిండ్రోమ్ వైద్యులకు సవాల్‌ గా మారిందని కొన్నేళ్లుగా వైద్యులు చెబుతూ వస్తున్నారు. ఇడియట్ సిండ్రోమ్ అంటే ఇంటర్నెట్లో హెల్త్ సమాచారం కోసం గంటల తరబడి వెతకడం. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో యాంగ్జైటీ వంటి సమస్యలు వస్తాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ జర్నల్ పేర్కొంది. ఇదే సమయంలో... వెబ్‌ సైట్ అనేది ఒక టూల్ మాత్రమే తప్ప.. డాక్టర్‌ తో ఏమాత్రం సమానం కాదని ఆ జర్నల్ తెలిపింది.

ఈ క్రమంలోనే... విశ్వసనీయమైన వైద్య వెబ్‌ సైట్‌ లు, ఆన్‌ లైన్ సపోర్ట్ గ్రూపులు విలువైన సమాచారాన్ని అందించగలవు.. అదేవిధంగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇతరులతో రోగులను కనెక్ట్ చేయగలవు. అయినప్పటికీ.. అర్హత కలిగిన వైద్య నిపుణుడితో అవి ఏమాత్రం సమానం కావని నొక్కి చెబుతున్నారు.

ఇడియట్ సిండ్రోమ్ నుండి బయటపడటం ఎలా?:

మీరు ఇడియట్ సిండ్రోమ్ నుండి బయటపడాలంటే.. ఈ సమస్యను ముందుగా సీరియస్‌ గా తీసుకోవాలని అంటున్నారు నిపుణులు. ఇందులో ప్రధానంగా... మొబైల్ వాడకాన్ని తగ్గించుకోవాలి. పైన పేర్కొన్న లక్షణాలు ఏవైనా ఉంటే.. వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి. మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నా, ముందుగా వైద్యుడిని సంప్రదించండి. సరైన సమాచారం లేకుండా ఇంటర్నెట్‌ లో మీరు కనుగొన్న ప్రతిదాన్ని నమ్మవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు!

Tags:    

Similar News