బ్యాంకింగ్ ఉద్యోగులకు ఏఐ ఎఫెక్ట్... ఏ స్థాయిలో అంటే..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా డిజిటల్ రంగంలో ఏఐ తన పరిధిని రోజు రోజుకీ విస్తరించుకుంటుందని అంటున్నారు. ఏఐ చాట్ బాట్ ల సాయంతో చాలా పనులు సులభంగా జరిగిపోతున్నాయని చెబుతున్నారు.
ఇదే సమయంలో... ఏఐ ఎంట్రీ వల్ల ఉద్యోగాలకు పెద్ద దెబ్బ అనే చర్చా తదనుగుణంగా తెరపైకి వచ్చింది. ఈ సమయంలో తాజాగా బ్యాంక్ ఉద్యోగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భారీ కోత విధించే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా... బ్లూమ్ బెర్గ్ నివేదిక షాకింగ్ విషయాలు వెల్లడించింది.
అవును... బ్యాంకింగ్ రంగంలో గణనీయమైన మార్పులు తీసుకురావడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సిద్ధంగా ఉందని బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ఇందులో భాగంగా... రాబోయే ఐదేళ్లలో గ్లోబల్ బ్యాంక్ లు తమ ఉద్యోగుల సంఖ్యను సూమారు 2,00,000 వరకూ తగ్గించగలవని అంచనా వేసింది.
దీనికి కారణం... భవిష్యత్తులో బ్యాంకులు తమ తమ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఖర్చులను తగ్గించుకోవడంతోపాటు కస్టమర్ అనుభవాలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఎక్కువగా అనుసరిస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇది బ్యాంకింగ్ ఉద్యోగాల్లో సుమారు 3శాతం వార్షిక క్షీణతను సూచిస్తుందని అంటున్నారు.
అయితే... ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు కనుమరుగవూతున్నప్పటికీ.. ఏఐ అభివృద్ధి కొన్ని కొత్త ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో... బ్యాంకింగ్ రంగంలో మాత్రమే కాకుండా.. చాలా కంపెనీలు అన్ని ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలను ఏఐతో భర్తీ చేయడానికి కృషి చేస్తున్నాయని చెబుతున్నారు.