'చెప్పి' మరీ.. పంపిస్తున్నారు!
అది కూడా .. ప్రపంచ వ్యాప్తంగా మంచి లాబాల్లోనే ఉన్న గూగుల్ లోనే కావడం గమనార్హం. దీనికి కారణాలు మాత్రం సంస్త చెప్పడం లేదు.
ఇదేదో పెళ్లికో.. పేరంటానికో కాదు.. ఇంటికి! అవును.. ''మీరు ఇక దయచేయొచ్చు.. వచ్చే నెల నుంచి మీ సేవలు మాకు అవసరం లేదు!''- అని చెప్పి మరీ ఉద్యోగాలు పీకేసి ఇంటికి పంపించేస్తున్నారు. అది కూడా .. ప్రపంచ వ్యాప్తంగా మంచి లాబాల్లోనే ఉన్న గూగుల్ లోనే కావడం గమనార్హం. దీనికి కారణాలు మాత్రం సంస్త చెప్పడం లేదు. అయితే.. ఇలా తొలగిస్తున్నవారి వేతనాలు.. మాత్రం రూ.4 నుంచి 12 లక్షల మధ్య(నెలకు) ఉన్నాయి. దీంతో వారు ఒక్కసారిగా కుంగిపోతున్నారు.
ఈఎంఐలు, ఇంటి అద్దెలు, ఆరోగ్య బీమాలు, కారు కిస్తీలు వంటివి వారికి భారంగా మారుతున్నాయి. అయితే.. సంస్థ ఇక్కడ ఒక చిన్న వెసులు బాటు కల్పించింది. నాలుగో వంతు వేతనానికి.. ఇదే సంస్థలో వేరే విభాగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అందులోనూ నియామకం ఖాయం కాదని స్పష్టం చేసింది.
ఇక, ప్రస్తుతం గూగుల్‌కు లాభాలు వస్తున్నా... అంతర్జాతీయంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలు.. ప్రభుత్వాల నుంచి వస్తున్న వత్తిళ్ల కారణంగా నిఘా కోసమే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని గత వారం ఇచ్చిన ప్రకటనలో గూగుల్ పేర్కొంది.
ప్రస్తుతం గూగుల్ రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ విభాగాల్లో ఎక్కువ మంది ఉన్నారని సంస్థ చెబుతోంది. ఎన్నికలు.. యుద్ధాలు, చమురు ధరల పెరుగుదల కారణంగా.. ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ వంటివి ఒకింత నష్టాల్లో ఉన్నాయని చెబుతున్నారు.
దీనివల్ల గూగుల్ ట్రెజరీ, బిజినెస్ సర్వీసెస్, రెవెన్యూ క్యాష్ ఆపరేషన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయని సమాచారం. అందుకే.. ప్రస్తుతం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా నష్టాలను పూడ్చుకునే ప్రయత్నంలో ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. మరోవైపు.. వచ్చే 2030 నాటికి ప్రపంచ దేశాలు ఏఐకి మారుతున్న దరిమిలా ఈ మార్పులు సహజమేనని అంటున్నారు.