వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!
బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం ఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్, వెబ్ క్యామ్ ల ద్వారా కూడా వీరికి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.
కరోనా సమయంలో తెరపైకి వచ్చిన వర్క్ ఫ్రం హోం... ఐటీ కంపెనీలకు ఎంతో ఉపయోగపడిందని కొంతమంది అంటే... ఉద్యోగులకు బాగా ప్లస్ అయ్యిందని మరికొంతమంది అంటుంటారు. అయితే కోవిడ్ అనంతరం సాధారణ పరిస్థితులు నెలకొన్న అనంతరం ఈ విషయంపై పలు ఐటీ కంపెనీలో ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ సమయంలో ఒక కీలక విషయం తెరపైకి వచ్చింది.
అవును... కోవిడ్ ముగిసినా ఇప్పటికీ వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ న్యూస్ ప్రకారం... కీస్ట్రోక్ మానిటరింగ్ సాఫ్ట్ వేర్ ద్వారా పలు ఐటీ సంస్థలు వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఉద్యోగులపై నిఘా పెట్టాయంట. ఈ నిఘా ఫలితంగా... పని పట్ల అలసత్వం ప్రదిర్శిస్తున్న రిమోట్ వర్క్ ఉద్యోగులను తొలగిస్తున్నాయని తెలుస్తుంది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ తాజా రిపోర్ట్ సంచలనంగా మారింది. బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక ప్రకారం ఎంప్లాయిస్ మానిటరింగ్ టూల్స్, వెబ్ క్యామ్ ల ద్వారా కూడా వీరికి పర్యవేక్షిస్తున్నారని అంటున్నారు.
ఇక కోవిడ్ అనంతరం పలు ఐటీ కంపెనీలు ఇప్పటికే వర్క్ ఫ్రం హోం కు స్వస్థిపలకాలని తమ తమ ఉద్యోగులకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు వర్క్ ఫ్రం ఆఫీసు విధానమే మేలని చెబుతున్నాయి. ఇప్పటికే ఈ మేరకు వర్క్ ఫ్రం హోం లో ఉన్న ఉద్యోగులకు ప్రత్యేకంగా నోటీసులు పంపించింది.
అయినా కూడా కొంతమంది ఉద్యోగులు, ఎక్స్ పర్ట్ లు, మరికొంతమంది సీనియర్లు ఈ నోటీసులకు పూర్తిగా రెస్పాండ్ అవ్వడం లేదని చెబుతున్నారు. దీంతో... సరిగ్గా ఇలాంటి వారిపైనే ఆయా కంపెనీలు ప్రత్యేక సాఫ్ట్ వేర్ల ద్వారా వారిపై నిఘా పెడుతున్నట్టు తాజా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది. దీంతో... డ్యూటీ టైంగ్స్ లో కంప్యూటర్లకు దూరంగా ఉన్న ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి.
కాగా... కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ సమయంలో కంపెనీలకు, ఉద్యోగులకూ కూడా "వర్క్ ఫ్రమ్ హోమ్" బాగా ఉపయోగపడింది. కరోనా తగ్గిపోవడంతో దాదాపు అన్ని కంపెనీలు "హైబ్రిడ్" విధానానికి స్వస్తి పలికి, ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి రావాలని ఆదేశిస్తున్నాయి.
ఇందులో భాగంగా "వర్క్ ఫ్రమ్ ఆఫీస్" విధానాన్ని సమర్ధిస్తున్న వారిలో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి ప్రముఖంగా నిలుస్తున్నారు.. ఇంటి నుండి పనిచేసే వ్యక్తుల నుంచి తక్కువ ఫలితం ఉంటుందనేది ఆయన వాదన.