రూ.లక్ష కోట్ల పండగ ఇ-వ్యాపారం... ఎక్కువగా ఏమి కొన్నారంటే..?
అవును... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు తమ నెల రోజుల పండుగ సీజన్ అమ్మకాలను ముగించాయి.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశంలో.. ప్రధానంగా పండగలు వచ్చాయంటే కనిపించే సందడి వేరే రేంజ్ లో ఉంటుందని చెబుతారు. ఈ క్రమంలో గత నెల రోజుల వ్యవధిలో పండగ అమ్మకాలు అత్యద్భుతంగా జరిగాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా... ఇ-కామర్స్ కంపెనీల అమ్మకాలు రూ.1లక్ష కోట్ల విలువైన అమ్మకాలను సాధించాయి.
అవును... అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ప్రధాన ఇ-కామర్స్ కంపెనీలు తమ నెల రోజుల పండుగ సీజన్ అమ్మకాలను ముగించాయి. ఈ మేరకు ఈ నెలరోజుల్లోనూ రూ.1 లక్ష కోట్ల విలువైన అమ్మకాలను సాధించాయి. ఈ పండగ సీజన్ లో ప్రీమియం స్మార్ట్ ఫోన్ల అమ్మకాలతో పాటు అన్ని విభాగాల్లోనూ అంచనాలకు మించి అమ్మకాలు జరిగాయని అంటున్నారు.
డేటామ్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం... ఈ ఏడాది పండగ సీజన్ లో 55% అంచనాలతో పోలిస్తే స్మార్ట్ ఫోన్ లు అత్యధికంగా 65% ఆన్ లైన్ లో కొనుగోలు చేయబడ్డాయి. వాస్తవానికి గత రెండు మూడేళ్లుగా ఆన్ లైన్ లో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 2022 లో ఈ వ్యాపారం రూ.69,000 కోట్లను తాకగా.. 2023లో ఇది రూ.81,000 కోట్లకు చేరుకుంది.
అయితే.. ఈ ఏడాది ఈ లెక్క రూ. 1 లక్ష కోట్లకు చేరుకుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా ఏఐ, ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోళ్లు ఈ మార్పుకు కారణమయాయని గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ నొక్కి చెప్పింది. టైర్-2, టైర్-3 నగరల్లో ప్రధానంగా స్మార్ట్ ఫోన్ లు, ఫ్యాషన్, టెలివిజన్ వంటి కేటగిరీల్లో డిమాండ్ భారీగా పెరిగిందని అంటున్నారు.
ఇక మెట్రోపాలిటన్, టైర్-1 నగరాలు ఈ విషయంలో ఆధిపత్యం చెలాయించాయని నివేదిక పేర్కొంది. పర్సనల్ కేర్, ఎలక్ట్రనిక్స్, గిఫ్ట్స్ తో పాటు చివరి నిమిషంలో కస్టమర్లు కిరాణా, పండ్లు, కూరగాయలపై కూడా ఖర్చు చేయడంతో ఇది జరిగిందని అంటున్నారు. వీటిలో.. ఫ్యాషన్ మినహా మిగిలిన అన్ని కేటగిరీ అమ్మకాలూ అంచనాలను అధిగమించాయని నివేదిక వెల్లడించింది.
ఈ ఏడాది కేటగిరీల వారీగా అంచనాలు.. జరిగిన వ్యాపారం వివరాలు ఇప్పుడు చూద్దాం...!
బ్యూటీ & పర్సనల్ కేర్: అంచనా 41% - జరిగిన వ్యాపారం 43%
కిరాణా: అంచనా 60% - జరిగిన వ్యాపారం 65%
ఇల్లు, సాధారణ వస్తువులు, పుస్తకాలు: అంచనా 21% - జరిగిన వ్యాపారం 23%
మొబైల్స్: అంచనా 19% - జరిగిన వ్యాపారం 25%
ఎలక్ట్రానిక్స్ & కన్స్యూమర్ డ్యూరబుల్స్: అంచనా 13% - జరిగిన వ్యాపారం 14%
ఫ్యాషన్: అంచనా 20% - జరిగిన వ్యాపారం 16%