27 ఏళ్ల క్రితం తప్పిపోయి అఘోరాగా ప్రత్యక్షం... డీఎన్ఏ టెస్ట్ డిమాండ్!

మౌనీ అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణీ సంగమంలో "అమృత స్నానం" చేసేందుకు ప్రయాగ్ రాజ్ కు బుధవారం భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే.

Update: 2025-01-30 08:30 GMT

మౌనీ అమావాస్య సందర్భంగా పవిత్ర త్రివేణీ సంగమంలో "అమృత స్నానం" చేసేందుకు ప్రయాగ్ రాజ్ కు బుధవారం భక్తులు పోటెత్తిన సంగతి తెలిసిందే. బుధవారం తెల్లవారుజాము నుంచి భక్తులు స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా హెలీకాప్టర్ల ద్వారా సాధువులపై పూలవర్షం కురిపించారు. ఈ సమయంలో 27 ఏళ్ల క్రితం తప్పిపోయిన వ్యక్తి అఘోరాగా కనిపించి షాకిచ్చారు!

అవును... సుమారు 27 ఏళ్ల క్రితం 1998వ సంవత్సరంలో కనిపించకుండా పోయిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పుడు 'అఘోరీ' బాబా రాజ్ కుమార్ గా కనిపించాడు. ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో సుదీర్ఘ అన్వేషణకు ముగింపు పలుకుతూ తమ సభ్యుడిని గుర్తించినట్లు జార్ఖండ్ కు చెందిన ఫ్యామిలీ బుధవారం పేర్కొంది.

వివరాల్లోకి వెళ్తే... 1998లో పాట్నా వెళ్లిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తి కనిపించకుండా పోయారట. ఇతనికి భార్య ధన్వాదేవితో పాటు కమలేష్, విమలేష్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వాళ్లందరినీ విడిచి గంగాసాగర్ ఎక్కడికో వెళ్లిపోయారు. అప్పటి నుంచి అతడి ఆచూకీ లేదు. ఈ క్రమంలో అతని పోలికలతో ఉన్న ఓ అఘోర కుంభమేళాలో కనిపించారంట.

ఈ విషయాలపై స్పందించిన గంగాసాగర్ తమ్ముడు మురళీ యాదవ్... కుంభమేళాలో తన అన్నను పోలి ఉన్న వ్యక్తిని గమనించిన తమ బంధువుల్లో ఒకరు అతని ఫోటో తీసి పంపించారని.. దీంతో.. గంగాసాగర్ భార్య ధన్వాదేవి, కుమారులు అతనిని కలుసుకోవాలని కుంభమేళాకు చేరుకున్నారని వెల్లడించారు.

ఈ సమయంలో అతడి ఎత్తు దంతాలు, నుదిటిపై గాయం, మోకాలిపై గుర్తించదగిన కొన్ని మచ్చలను చూపుతూ.. తమ ముందున్న వ్యక్తి నిజంగా గంగాసాగర్ అని అతని కుటుంబం గుర్తుపట్టిందట. ఈ సమయంలో.. తన భార్య ధన్వాదేవి తన భర్తతో మాట్లాడేందుకు ప్రయత్నించిందని చెబుతున్నారు.

ఈ సమయంలో... గంగాసాగర్ గా తాము భావిస్తున్న వ్యక్తి గుర్తింపును నిర్ధారించడానికి డీఎన్ఏ పరీక్షను కోరుతూ మురళీయాదవ్ కుంభమేళా పోలీసులకు తెలియజేశారు. కుంభమేళా ముగిసేవరకూ వేచి చూస్తామని.. అవసరమైతే డీఎన్ఏ పరీక్షకు పట్టుబడతామని.. ఒక వేళ పరీక్ష సరిపోకపొతే బాబా రాజ్ కుమార్ కు క్షమాపణలు చెబుతామని అన్నారు.

ఈ సమయంలో కొంతమంది కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి రాగా.. మరికొంతమంది మాత్రం బాబా రాజ్ కుమార్ ను నిశితంగా గమనిస్తూ కుంభమేళాలోనే ఉన్నారని అంటున్నారు. కుంభమేళా ముగిసిన అనంతరం డీఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాతే వారు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో చట్టపరమైన చర్యలకు వారు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

కాగా... గంగాసాగర్ ఇంట్లో నుంచి వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని అన్ని రకాలగానూ ఇబ్బంది పెట్టిందని అంటారు. అతడు అదృశ్యమైన సమయంలో పెద్ద కుమారుడి వయసు కేవలం రెండు సంవత్సరాలు కాగా.. అతని చిన్న కుమారుడు ఇంకా తల్లి గర్భంలోనే ఉన్నాడు. ఇతడి అదృశ్యం వారి జీవితాలను నాశనం చేసిందని అంటున్నారు.

Tags:    

Similar News