42 ల‌క్ష‌ల ఓట్లు.. ఏక‌ప‌క్ష‌మేనా? వైసీపీ ఏం చెబుతోందంటే!

మ‌రి ఇప్ప‌టి ప‌రిస్థితి ఏంటి? ఆ 70 శాత‌మైనా..(కొంచెం అటు ఇటుగా) ఇప్పుడు వైసీపీవైపు ఉన్నారా?అ నేది చ‌ర్చ‌.

Update: 2024-05-26 07:30 GMT

42 ల‌క్ష‌ల ఓట్లు.. అంటే మాట‌లు కాదు. ఈఓట్లు ఎవ‌రికి ఏక‌ప‌క్షంగా ప‌డినా.. వారు విజ‌యం ద‌క్కించుకోవ డం సునాయాస‌మే అవుతుంది. దీంతో ఈ 42 ల‌క్ష‌ల ఓట్ల వ్య‌వ‌హారం ఇప్పుడు ఆస‌క్తిగా మారింది. వారే.. రెడ్డి సామాజిక వ‌ర్గం. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి సామాజిక వ‌ర్గం అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ క‌లిపి 42.32 ల‌క్ష‌ల ఓట్లు ఉన్నాయి. మెజారిటీగా ఇవి.. క‌ర్నూలు, క‌డ‌ప‌, అనంత‌పురం, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి. గ‌త 2019 ఎన్నిక‌ల్లో వీరి ఓట్లు 70శాతం వ‌రకు వైసీపీకి ప‌డ్డాయి.

అంటే.. సీఎం జ‌గ‌న్ పాద‌యాత్ర చేసి.. ఒక్క ఛాన్స్ అని పిలుపునిచ్చిన‌ప్పుడే.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఆయ నకు 70 శాతం మేర‌కే అండ‌గా ఉంది. ఉర‌వ కొండ నియోజ‌క‌వ‌ర్గంలో రెడ్డి వ‌ర్గం పూర్తిగా టీడీపీకి అను కూలంగా ప‌నిచేసింది. దీంతో అక్క‌డ ప‌య్యావుల కేశవ్ విజ‌యం ద‌క్కించుకున్నారు. అలానే.. క‌డ‌ప లోనూ ఆదినారాయ‌ణ‌రెడ్డి(క‌డ‌ప ఎంపీగా 2019లో పోటీ చేశారు) కి భారీగానే రెడ్లు ఓటేశారు. అప్పట్లో ఈయ న కూడా. టీడీపీ నుంచే బ‌రిలో ఉన్నారు. అంటే.. ఆ 30 శాతం రెడ్లు.. వైసీపీ కంటే కూడా.. వ్య‌క్తుల‌ను అప్ప‌ట్లో ఆద‌రించారు.

మ‌రి ఇప్ప‌టి ప‌రిస్థితి ఏంటి? ఆ 70 శాత‌మైనా..(కొంచెం అటు ఇటుగా) ఇప్పుడు వైసీపీవైపు ఉన్నారా?అ నేది చ‌ర్చ‌. ఎందుకంటే.. రెడ్డి సామాజిక వ‌ర్గం ఆశించిన మేర‌కు వైసీపీ పాల‌న అయితే సాగ‌లేదు. ఇదే విష‌యం గంగాధ‌ర నెల్లూరు, గుంటూరు పార్ల‌మెంటు ప‌రిధిలోని రెడ్లు ఎన్నిక‌ల‌కు ముందు తేల్చి చెప్పా రు. ఎస్సీ ఎస్టీల‌కు ప్రాధాన్యం ఇచ్చిన దానిలో స‌గం కూడా త‌మ‌కు ఇవ్వ‌లేద‌న్నారు. ఇచ్చినా.. జ‌గ‌న్ వ్యాపార వ‌ర్గాలుగా ఉన్న రెడ్డి వ‌ర్గానికి మాత్ర‌మే ప్రాధాన్యం ద‌క్కింద‌ని చెప్పుకొచ్చారు.

2019లో తెనాలిలో వైసీపీ నేత అన్నాబ‌త్తుని శివ‌కుమార్ విజ‌యం ద‌క్కించుకున్నారు. ఇక్క‌డ రెడ్డి వ‌ర్గం అంతా ఆయ‌న‌కు అప్ప‌ట్లో అండ‌గా ఉంది. కానీ... ఇప్పుడు ఇక్క‌డ రెడ్డి వ‌ర్గం కాద‌ని చెప్పింది. అమ‌రావ‌తి ప్రాంతంలో వీరు కూడా.. కొన్ని బూములు కొన్నారు. రియ‌ల్ వ్యాపారాలు కూడా చేశారు. కానీ.. వైసీపీ వ‌చ్చాక‌.. ఇవ‌న్నీ నాశ‌నం అయిపోయాయి. ఈ ఎఫెక్ట్‌తో వీరు.. వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు చాలానే ఉన్నాయి. వీటిని బేరీజు వేసుకుంటే.. 42 ల‌క్ష‌ల ఓటు బ్యాంకు ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో వైసీపీకి ఇప్పుడు 10-15 ల‌క్ష‌లు ప‌డితే ఎక్కువ అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News