యూఎస్ వీసా స్లాట్ కు 470రోజుల వెయిటింగ్
తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక టెకీ యూఎస్ వీసా స్లాట్ కోసం తాను చేస్తున్న ప్రయత్నాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది.
అమెరికా కలకు మొదటి అడ్డంకి వీసా ప్రక్రియ. ఇంటర్వ్యూలో వీసా వస్తుందో రాదో తెలీని పరిస్థితి. దానికి ముందు అవసరమైన వీసా స్లాట్ కోసం వెయిటింగ్ చేస్తూ.. చేస్తూ కళ్లు కాయలు కాచే పరిస్థితి ఇటీవల కాలంలో నెలకొంది. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక టెకీ యూఎస్ వీసా స్లాట్ కోసం తాను చేస్తున్న ప్రయత్నాల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. దీనికి కారణం..సదరు టెకీ తన స్నేహితుడి కోసం ప్రయత్నాలు చేయటం.. అందులో భాగంగా ఆయనకు బోలెడన్ని అనుభవాలు అయ్యాయి.
ఎట్టకేలకు స్లాట్ కోసం చేసిన ప్రయత్నాల్లో సక్సెస్ అయిన సదరు టెకీ.. చివరకు వచ్చిన ఫలితంతో అవాక్కు అయ్యాడు. దీనికి కారణం.. యూఎస్ వీసా ఇంటర్వ్యూ స్లాట్ కు 470రోజులు వెయిటింగ్ చేయాలన్న సందేశం రావటమే దీనికి కారణం. అమిత్ భవానీ అనే వ్యక్తికి ఎదురైన ఈ అనుభవం ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ పోస్టుపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు.
వెయిటింగ్ పిరియడ్ ఇంత భారీగా ఉన్న నేపథ్యంలో.. కన్సల్టెంట్లను సంప్రదించాలని.. వారైతే వెంటనే వీసా స్లాట్ వచ్చేస్తుందన్న సలహాను ఇచ్చారు. కొందరు మాత్రం యూఎస్ వీసా స్లాట్ కోసం తాము పడుతున్న కష్టాల్ని ఎకరువు పెట్టారు. నీకు 470 రోజులకైనా స్లాట్ దొరికిందన్న ఒకరు.. తనకు అంతకు మించి అన్నట్లు పరిస్థితి ఉందని పేర్కొన్నారు.
ఇలా ఎవరికి వారు తమకు ఎదురైన అనుభవాల్ని షేర్ చేసుకున్నారు. ఏజెంట్లకు కొంత డబ్బు ముట్టచెబితే.. స్లాట్ లను ఈజీగా పట్టేస్తారని.. ఆ మార్గంలోకి వెళ్లాలని చెప్పారు. మొత్తంగా ఒక రోజు మొత్తం ప్రయత్నాలు చేయగా.. చివరకు ఆగస్టు 26న తాను వీసా స్లాట్ సొంతం చేసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఏజెంట్లకు ఎలాంటి డబ్బులు చెల్లించకుండానే తాను వీసా స్లాట్ ను సాధించగలిగినట్లు చెప్పారు.