ఎవరెస్ట్ పై 100 ఏళ్ల నాటి కాలు... పర్వతారోహణకు ముందు చివరి పిక్ ఇదిగో!

అవును... హిమాలయా పర్వతాల్లో సుమారు వందేళ్ల నాటి ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. ఇందులో భాగంగా... 1924లో ఎవరెస్ట్ యాత్రలో అదృశ్యమైన బ్రిటీష్ యువకుడి కాలుగా దాన్ని భావించారు.

Update: 2024-10-12 08:30 GMT

సుమారు 100 సంవత్సరాల క్రితం.. 1924 జూన్ లో తన పార్ట్నర్ జార్జ్ మల్లోరీతో కలిసి బ్రిటీష్ కి చెందిన యువ పర్వతారోహకుడు హిమాలయ పర్వతాలకు ప్రయాణమయ్యాడు. అయితే అతడు ఎవరెస్ట్ ని అదిరోహించిన తర్వాత తప్పిపోయాడు. ఈ క్రమంలో శతాబ్ధకాలం గడిచిపోయింది. అయితే అనూహ్యంగా అతడి కాలు దొరికింది!

 

అవును... హిమాలయా పర్వతాల్లో సుమారు వందేళ్ల నాటి ఓ పర్వతారోహకుడి కాలు బయటపడింది. ఇందులో భాగంగా... 1924లో ఎవరెస్ట్ యాత్రలో అదృశ్యమైన బ్రిటీష్ యువకుడి కాలుగా దాన్ని భావించారు. గత నెలలో ఓ సాహసయాత్రలో నేషనల్ జియోగ్రఫిక్ డాక్యుమెంటరీ టీం... స్టీల్ హాబో నెయిల్ లతో పాత అరిగిపోయిన లెదర్ బూట్ ను కనుగొంది.

 

ఆ సాక్సులపై "ఏసీ ఇర్విన్" అనే పేరుతో ఎంబ్రాయిడరీ చేసి ఉంది. దీంతో... దీనిపై వారు రీసెర్చ్ చేసినట్లు చెబుతున్నారు! ఇర్విన్ తన భాగస్వామి మల్లోరీ మృతిచెందక ముందు ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడంలో సక్సెస్ అయ్యారని గుర్తించారు. వీరు పర్వతం నుంచి దిగే సమయంలో ప్రాణాలు కోల్పోకపోయి ఉంటే ఓ రికార్డ్ నెలకొల్పి ఉండేవారు!

 

కారణం.. సర్ ఎడ్మండ్ హిల్లరీ, టెంజింగ్ నార్గే కంటే 29 సంవత్సరాల ముందు ఈ అద్భుతమైన ఫీట్ ను సాధించినవారయ్యేవారు! వాస్తవానికి మల్లోరీ అవశేషాలు 1999లోనే కనుగొనబడినప్పటికీ.. ఇర్విన్ అవశేషాలు మాత్రం లభ్యం కాలేదు. ఈ క్రమంలో తాజాగా అతని కాలు దొరికింది.

 

దీంతో... ఇర్విన్ మునిమనవరాలు డీ.ఎన్.ఏ.తో పోల్చి చూడగా.. ఇది అతడి కాలేనని తేలిందని అంటున్నారు. ఇది నిజంగా నమ్మశక్యంగా లేదని.. ఈ విషయం తెలిసి స్తంభించిపోయానని ఇర్విన్ మేనకోడలు చెబుతున్నారు! ఈ సందర్భంగా ఇర్విన్ - మల్లోరీ పర్వతారోహణకు వెళ్లే ముందు తీసుకున్న చివరి చిత్రం వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News