ట్రంపొచ్చాడు.. అబార్షన్ మాత్రలకు మహా గిరాకీ..ఎంతగానంటే?

కాగా, అమెరికాలో 2022 మే నెలలో గర్భ విచ్ఛిత్తికి వ్యతిరేకంగా చట్టం తెస్తారనే పెద్దఎత్తున ఊహాగానాలు వచ్చాయి.

Update: 2024-11-12 12:09 GMT

ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అత్యంత కీలకంగా నిలిచింది అబార్షన్‌ హక్కు. రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గనుక మళ్లీ అధికారంలోకి వస్తే అబార్షన్‌ హక్కుపై నిషేధం విధిస్తారనేది అందరూ ఊహించిన విషయం. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో వారి ఆందోళన నిజమవుతోంది. కాగా, అమెరికాలో 2022 మే నెలలో గర్భ విచ్ఛిత్తికి వ్యతిరేకంగా చట్టం తెస్తారనే పెద్దఎత్తున ఊహాగానాలు వచ్చాయి. దీంతో అబార్షన్ మాత్రలు కొనుక్కునేందుకు ప్రజలు ఎగబడ్డారు. అప్పట్లో వీటి గిరాకీ 10 రెట్లు పెరిగింది.

24 గంటల్లో 10 వేల మంది

అమెరికాలో ఇప్పుడు ఒక్కదానికే గిరాకీ. అదే అబార్షన్‌ మాత్రలు. వీటికి అంతగా డిమాండ్ పెరిగింది. ఎంతగా అంటే.. కేవలం 24 గంటల్లోనే 10 వేల మంది పైగా అబార్షన్ మాత్రల కోసం అభ్యర్థనలు చేశారట. దీనికి ప్రధాన కారణం.. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక గర్భ విచ్ఛిత్తి (అబార్షన్) హక్కును నిషేధిస్తారని బలంగా నమ్మడమే.

17 రెట్లు ఎక్కువ డిమాండ్..

ట్రంప్‌ విజయం సాధించినా అమెరికా పగ్గాలు చేపట్టేందుకు మరో రెండు నెలల సమయం ఉంది. కానీ, అమెరికాలో వైద్య విధానం వేరు. ముందస్తు అపాయింట్ మెంట్ తప్పనిసరి. ఇప్పుడు ట్రంప్ గెలుపుతో అబార్షన్ హక్కుల నిషేధం ముందుకొచ్చింది. దీంతో 24 గంటల్లోనే అబార్షన్‌ మాత్రల కోసం 10 వేలపైగా అభ్యర్థనలు వచ్చాయట. ఇది రోజూ ఉండే డిమాండ్‌ కంటే 17 రెట్లు ఎక్కువట. విషయం ఏమంటే.. గర్భిణులు కానివారు సైతం ప్రిస్కిప్షన్‌ కోసం ముందస్తుగా సంప్రదిస్తున్నారని ఓ ఎన్జీవో వెల్లడించింది. తమకు వచ్చిన 125 ఆర్డర్లలో 22 మంది గర్భిణులు కాదని పేర్కొంది.

వెట్ సైట్ ట్రాఫిక్ టెర్రిఫిక్

అమెరికా ఎన్నికలకు ముందు అబార్షన్ మాత్రలు ఎక్కడ దొరుకుతాయంటూ 4000-4,500 తమ వెబ్‌ సైట్‌ ను చూసేవారని, ఫలితాలు వచ్చాక ఈ సంఖ్యలో భారీ మార్పు కనిపిస్తోందని మరో స్వచ్ఛంద సంస్థ తెలిపింది. ఒక్క రోజులోనే 82 వేల మందికి పైగా వెబ్‌ సైట్‌ ను చూస్తున్నారని, గర్భ నిరోధక పరికరాలు, వేసక్టమీ శస్త్రచికిత్సలను తెలుసుకొనేందుకు కూడా ప్రయత్నిస్తున్నారని చెప్పింది. ట్రంప్ గెలుపుతో ఆందోళన చెందుతున్నచాలామంది మాత్రలు నిల్వ చేసుకున్నట్లు నేషనల్‌ అబార్షన్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు బ్రిటనీ ఫోంటెనో తెలిపారు.

Tags:    

Similar News