వదినతో అక్రమ సంబంధం.. అన్నను దారుణంగా చంపేసిన తమ్ముడు

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోచోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే నోటమాట రాదంతే.

Update: 2025-01-19 04:37 GMT

బంధాలు ఏమవుతున్నాయి? అనుబంధాలు ఎక్కడికి పోతున్నాయి? విన్నంతనే మనసంతా చేదుగా మారే ఈ ఉదంతం గురించి వెళితే.. వదినతో అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేసేందుకు అడ్డు వస్తున్నాడన్న కోపంతో అన్నను దారుణంగా చంపేశాడో తమ్ముడు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోచోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి తెలిస్తే నోటమాట రాదంతే.

నాను తండాకు చెందిన 28 ఏళ్ల శంకర్.. 20 ఏళ్ల గోపాల్ ఇద్దరు అన్నదమ్ములు. శంకర్ గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకున్నాడు. ఉపాధి కోసం హైదరాబాద్ లో ఉన్నప్పుడు మరో అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. కొద్ది రోజుల క్రితం భార్యను తీసుకొని తండాకు వచ్చాడు. అయితే.. శంకర్ భార్యతో గోపాల్ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడు.

తన భార్యతో తమ్ముడు సన్నిహితంగా ఉన్న విషయాన్ని గుర్తించిన శంకర్.. తన భార్య జోలికి రావొద్దంటూ హెచ్చరించాడు. అయినా గోపాల్ తీరు మారకపోవటంతో పెద్దల సమక్షంలో పంచాయితీపెట్టాడు. దీంతో శంకర్ భార్య ఇల్లు వదిలి పెట్టి వెళ్లిపోయింది. అప్పటి నుంచి శంకర్ మీద గోపాల్ కక్ష పెంచుకుననాడు. ఇటీవల ఒక చోరీ కేసులో జైలుకు వెళ్లిన గోపాల్.. అవకాశం కోసం చూస్తున్నాడు.

ఇదిలా ఉండగా తాజాగా శంకర్ మద్య తాగి నిద్రపోయాడు. అతని వద్దే నిద్రపోయినట్లుగా నటించిన గోపాల్.. అర్థరాత్రి వేళ.. శంకర్ కాళ్లు.. చేతులకు విద్యుత్ వైర్లు చుట్టేసి.. ప్లగ్ బోర్డులో మరోవైపు వైర్లను పెట్టి స్విచ్ ఆన్ చేశాడు. దీంతో కరెంటు షాక్ కు గురైన శంకర్ పెద్ద ఎత్తున కేకలు వేశాడు. దీంతో వారి తండ్రి తలుపులు తీయమని అరవగా.. తలుపులు తీసిన గోపాల్ తండ్రి చందర్ ను నెట్టేసి అక్కడి నుంచి పారిపోయాడు. కరెంట్ షాక్ కు గురైన శంకర్ అక్కడికక్కడే మరణించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడు గోపాల ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ దుర్మార్గం స్థానికంగా షాకింగ్ గా మారింది.

Tags:    

Similar News