ఆ ఒక్క ప‌ని.. 'ఏబీవీ' ఫేట్‌ను మార్చేసిందా..?

ఒక్క ప‌ని.. ఒకే ఒక్క ప‌ని.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు భ‌విష్య‌త్తును మార్చేసిందా

Update: 2024-05-19 14:30 GMT

ఒక్క ప‌ని.. ఒకే ఒక్క ప‌ని.. సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావు భ‌విష్య‌త్తును మార్చేసిందా? ఆయ‌న ఫ్యూచ‌ర్‌పై గ‌ట్టి దెబ్బ కొట్టిందా? భ‌విష్య‌త్తులో ఏ అధికారి కూడా `అలా` చేయ‌కుండా చేసిందా? అంటే.. ఔన‌నే అంటున్నాయి.. ఐపీఎస్ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం ఐదు సంవ‌త్స‌రాలుగా ఉద్యోగానికి దూరంగా ఉండ‌డ‌మే కాదు.. నెల నెలా అందే వేత‌నం కూడా అంద‌క‌పోగా.. న్యాయ పోరాటాలు చేయ‌డంతోపాటు.. అవ‌మానాల‌ను కూడా ఎదుర్కొంటున్నారు ఏబీవీ.

మ‌రో 12 రోజ‌ల్లో రిటైర్మెంట్ కూడా కానున్న ద‌శ‌లో క‌నీసం.. ఈ ప‌దిరోజులు అయినా.. ఐపీఎస్‌గా మ‌రోసారి విధులు నిర్వ‌హించాల‌న్న ఆయ‌న చివ‌రి కోరిక కూడా.. ఫ‌లించేలా క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. `మ‌న‌` అన్న ఒక్క అత్యుత్సాహం. జ‌గ‌న్ ఏం చేస్తాడ‌నే దృఢ న‌మ్మ‌కం. ఈ రెండే ఏబీవీ త‌న అధికారాన్ని దుర్వినియోగం చేసేలా చేశాయి. అయితే.. ఇది ఆన్ రికార్డు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఆఫ్ ది రికార్డుగా.. 2016-17 మ‌ధ్య కాలంలో వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేలా.. ఏబీవీ ప్రోత్స‌హించారు.

చేరని వారిపై కేసులు పెట్టించారు. ఉదాహ‌ర‌ణ‌కు చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వంటివారు క‌నిపిస్తారు. చేరిన వారు 23 మందిలో ఏబీవీ బ‌ల‌వంతంతోచేరిన వారు 17 మంది ఉన్నారు. ఇదే.. జ‌గ‌న్‌లో క‌సిని నింపింది. అప్ప‌ట్లో ఆయ‌న సైలెంట్‌గానే ఉన్నారు. అధికారంలోకి వ‌చ్చాక ఏబీవీని ప‌క్క‌న పెట్టారు. ఇక‌, అక్క‌డి నుంచి స‌స్పెన్ష‌న్ల‌పై స‌స్పెన్ష‌న్ల‌తో విధుల‌కు దూరం పెట్టారు. కుమారుడు ఇజ్రాయెల్‌తో చేస్తున్న వ్యాపారంలో దేశ ద్రోహం ఉంద‌ని పేర్కొంటూ కేసులు కూడా న‌మోదు చేశారు.

అలానే, అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డారంటూ..ఏబీవీపై క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌ల‌కు కూడా సిఫార‌సు చేశారు. ఫ‌లితంగా ఏబీవీ భ‌విష్య‌త్తు అంధ‌కారంలో ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2019 నుంచి ఆయ‌న కంటిపై కునుకు తీసింది లేదు. క‌ల‌వ‌ర‌మే త‌ప్ప క‌లిసి వ‌చ్చిందికూడా లేదు. పార్టీలు మారిన వారు బాగానే ఉన్నారు. చేర్చుకున్న వారు కూడా బాగానే ఉన్నారు. ఎటొచ్చీ.. రాజ‌కీయ వ్యూహంలో ఏబీవీ బందీ అయ్యారు. ఇప్పుడు మ‌రో 12 రోజుల స‌ర్వీసు మాత్ర‌మే మిగిలి ఉన్న ద‌శ‌లోనూ ఆయ‌న‌కు పాజిటివ్‌గా ఎలాంటి అంశ‌మూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. సో.. మొత్తంగా ఎంత సీనియ‌ర్ అధికారి అయినా..త‌న హ‌ద్దులు దాటి వ్య‌వ‌హ‌రిస్తే.. ఏమ‌వుతుందో చెప్ప‌డానికి ఏబీవీ ఒక లెస్స‌న్‌గా మిగిలిపోయారు.

Tags:    

Similar News