ఏబీ వెంకటేశ్వర రావు సింగిల్ డే పోస్టింగ్ ఎక్కడంటే...?

సీనియ‌ర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Update: 2024-05-31 08:29 GMT

సీనియ‌ర్ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును సర్వీసులోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. వెంకటేశ్వర రావుపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన సస్పెన్షన్‌ ను ఇటీవల కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో సీఎస్‌ జవహర్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తాజాగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.

అవును... సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ ఛీప్ ఏబీ వెంక‌టేశ్వరావుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగా... ఆయ‌న‌ను ప్రింటింగ్, స్టేష‌న‌రీ అండ్ స్టోర్స్ ప‌ర్చేజ్ క‌మిష‌న‌ర్‌ గా నియ‌మించింది. దీంతో ఆయన తాజాగా బాధ్యత‌లు స్వీక‌రించారు. మ‌రోవైపు ఇవాళ సాయంత్రమే ఆయ‌న ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

గ‌తంలో కూడా ఒకసార్ సస్పెన్షన్ ఎత్తివేసిన త‌ర్వాత కూడా ఆయ‌న ప్రింటింగ్, స్టేష‌న‌రీ అండ్ స్టోర్స్ ప‌ర్చేజ్ క‌మిష‌న‌ర్‌ గా కొన్ని రోజుల పాటు ప‌ని చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో తాజాగా ఆయన ఉద్యోగంలో చివరి రోజు కూడా అదే డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు. ఏది ఏమైనా... సస్పెన్షన్ తో కాకుండా.. పోస్టింగ్‌ తోనే ఆయన రిటైర్ అవుతున్నారు.

కాగా... రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్‌ చేసింది. ఇదే సమయంలో.. టీడీపీ ప్రభుత్వ హ‌యాంలో నిఘా విభాగం అధికారిగా కీల‌క బాధ్యత‌లు నిర్వర్తించిన ఏబీ వెంకటేశ్వర రావు.. పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీల ఫోన్లను ట్యాప్ చేసేవార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు!

ఇదే క్రమంలో... 2014 ఎన్నికల అనంతరం త‌మ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు టీడీపీలో చేర‌డం వెనుక ఏబీ వెంక‌టేశ్వర‌రావు కీల‌క పాత్ర పోషించార‌ని వైసీపీ కీలక నేతలు ఆరోపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఏబీవీపై జ‌గ‌న్ సీరియ‌స్‌ గా ఉన్నారని అంటుంటారు. మరోవైపు... ఇవాళ సాయంత్రమే ఆయ‌న ఉద్యోగ విర‌మ‌ణ చేయ‌నున్నారు.

Tags:    

Similar News