అమరావతికి అధికార ముద్ర పడాల్సిందే !

ఇక అయిదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వస్తూనే అమరావతి రాజధాని పనుల మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది.

Update: 2024-11-27 00:44 GMT

అమరావతి రాజధాని అని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. దాని మీద శాసనసభ తీర్మానం చేసింది. టీడీపీ అయిదేళ్ళ పాలనలో అమరావతి రాజధానిగానే అనేక కార్యక్రమాలు చేపట్టారు. డిజైన్లు కూడా అమరావతికి సంబంధించి గొప్పగా తీర్చిదిద్దారు. అమరావతిని ప్రపంచ రాజధానిగా చేయాలని ప్లాన్స్ రూపొందించారు.

ఏకంగా నవ నగరాలను అమరావతిలో నెలకొల్పాలని కూడా అంతా సిద్ధం చేశారు. ఈ లోగా వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి రాజధాని ప్రభ మసకబారింది. దానికి బదులుగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తో వైసీపీ ముందుకు పోయింది.

ఇక అయిదేళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి వస్తూనే అమరావతి రాజధాని పనుల మీద యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. అంతే కాదు అమరావతికి సంబంధించి. రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది.

మరో వైపు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిచయంతో ప్రపంచ బ్యాంక్ నిధులను పదిహేను వేల దాకా తెచ్చుకుంటోంది. మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు వివిధ ఏజెన్సీల ద్వారా వస్తాయని కూడా చెబుతోంది. మొత్తనికి అమరావతి రాజధానిని పరుగులు పెట్టించాలని చూస్తోంది.

అయితే ఈ రోజుకీ ఏపీ రాజధాని అమరావతి అని గెజిట్ నోటిఫికేషన్ లేదు అని అంటున్నారు. దీని మీద విశాఖకు చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఒకరు అమరావతి రాజధాని ఏపీకి అని గెజిట్ నోటిఫికేషన్ ని తీసుకుని వచ్చే ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ మేరకు ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు కూడా.

ఇవన్నీ పక్కన పెడితే అది అత్యవసరం కూడా అని నొక్కి చెప్పారు. 2024 జూన్ 2 వరకూ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఆ తరువాత అది తెలంగాణాకు రాజధాని అయింది. ఏపీకి రాజధాని అమరావతి అని కేంద్రం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తేనే అన్ని రకాలుగా ఇబ్బందులు తొలగిపోతాయి.

దీంతో లేటెస్ట్ గా దీని మీద మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం అమరావతి రాజధాని అని అధికారికంగా ప్రకటించేలా గెజిట్ నోటిఫికేషన్ ని తొందరలోనే తీసుకుని వస్తామని చెప్పారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆయన చెప్పారు. ఇక అమరావతి ఏపీకి రాజధాని అని కేంద్రం పార్లమెంట్ లో ప్రకటన చేసింది అని ఆయన గుర్తు చేశారు. దాంతో అమరావతి రాజధాని అన్న దాంట్లో పూర్తి స్పష్టత అంతటా ఉందని అన్నారు.

మరో వైపు తొలి విడత ప్రపంచ బ్యాంకు నిధులు డిసెంబర్ లో వస్తాయని అంటున్నారు. దాంతో అమరావతిలో వివిధ అభివృద్ధి పనులకు టెండర్లను ఖరారు చేసే పనిలో ప్రభుత్వం ఉంది. అదే విధంగా అమరావతిలో అయిదు ఐకానిక్ టవర్లను నిర్మిస్తున్నారు.

అదే విధంగా అమరావతికి సంబంధించి పూర్తి స్థాయి డిజైన్ల కోసం కూడా టెండర్లు పిలిచామని మంత్రి నారాయణ చెబుతున్నారు. మొత్తానికి అమరావతి రాజధానిలో అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పాల్సిందే.

Tags:    

Similar News