హీరో విజయ్ టార్గెట్ గా విశాల్ సీరియస్ కామెంట్స్

సినీ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రాజకీయంగా ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-03-05 10:38 GMT

సినీ హీరో విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ రాజకీయంగా ప్రభావం చూపిస్తుందా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజకీయ ప్రవేశం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు మీడియా ముందుకు రాలేదని మరో నటుడు విశాల్ విమర్శించడంతో మరోసారి ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

విశాల్ మీడియాతో మాట్లాడుతూ ‘ముందు విజయ్‌ను మీడియా ముందుకు రమ్మనండి. ఆయన రాజకీయ పార్టీ స్థాపించి సంవత్సర కాలం పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఒక్కసారైనా మీడియా సమావేశం నిర్వహించలేదు’ అని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతూ, ‘నన్ను ప్రశ్నించే ముందు ముందుగా విజయ్‌ను ప్రశ్నించండి. ఆయన మీడియా ముందుకు వస్తే మీ సందేహాలకు సమాధానం లభిస్తాయి’ అని అన్నారు.

విశాల్ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. పలువురు నెటిజన్లు ఆయన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయ్‌కు ఉందని అంటున్నారు. మరికొందరైతే విజయ్ తన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

విజయ్ మౌనం వీడుతాడా? రాజకీయంగా అతని భవిష్యత్ ఎలాంటి రూపం దాలుస్తుందనే అంశాలపై ఆసక్తి కొనసాగుతోంది.

Tags:    

Similar News