బంగ్లాలో యువ నటుడిని ఎంత దారుణంగా చంపారంటే...?
ఈ క్రమంలోనే ఓ యువ నటుడు, దర్శకుడైన అతని తండ్రిని ఆందోళనకారులు అతి కిరాతకంగా చంపేశారు.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల కారణంగా షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి, దేశాన్ని విడిచి భారత్ కు వచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో బంగ్లాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువ నటుడు, దర్శకుడైన అతని తండ్రిని ఆందోళనకారులు అతి కిరాతకంగా చంపేశారు.
అవును... బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేయగానే అవామీ లీగ్ పార్టీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకొని అల్లరి మూకలు హింసాకాండకు పాల్పడ్డాయి. ఈ క్రమంలోనే యువ నటుడు శాంతో ఖాన్, దర్శకుడైన అతని తండ్రి దర్శక, నిర్మాత సలీమ్ ఖాన్ ను నడి రోడ్డుపై అతికిరాతకంగా చంపేశారు.
సలీమ్ ఖాన్ 2021లో షేక్ హసీనా తండ్రి బంగబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ బయోపిక్ ను తెరకెక్కించారు. ఈ సినిమాలో సలీమ్ కుమారుడు శాంతో ఖాన్ నటించాడు. ఇందులో భాగంగా. ముజిబుర్ రెహమాన్ యంగ్ గా ఉన్నప్పటి పాత్రను పోషించాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు శాంతో ఖాన్ కి మంచి పేరు వచ్చింది.
అయితే... హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేశారన్న వార్త బయటకు రాగానే ఆందోళనకారులు సలీమ్ ఖాన్, శాంతో ఖాన్ లను లక్ష్యంగా చేసుకున్నారు. దీంతో.. విషయం తెలుసుకున్న వీరిద్దరూ తమ స్వగ్రామానికి పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో మార్గమధ్యలోనే ఆందోళనకారులు వీరిని అడ్డుకున్నారు.
ఆ సమయంలో ఆత్మరక్షణ కోసం తండ్రీకొడుకు కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. కానీ... అప్పటికే ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టేశారు. ఈ క్రమంలోనే నడి రోడ్డుపైనే వీరిద్దరినీ కర్రలతో కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులు ధృవీకరించారు.