జగన్ టార్గెట్ : బాబు మీద షర్మిల సెటైర్లు
ఇవన్నీ ఇలా ఉంటే ఆనాడు ఈ ముడుపులో విషయంలో నేరుగా జగన్ మీదనే షర్మిల విమర్శలు చేసారు. అవినీతి జరగలేదని ప్రమాణం చేయాలని కూడా సవాల్ చేశారు.
ఏపీలో మూడు నెలల క్రితం ఒక ఇష్యూ రాజకీయ కలకలం సృష్టించింది. అదే అదానీతో నాటి వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ ఒప్పందాల వ్యవహారం. ఆ ఒప్పందాలలో నాటి వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు పాల్పడింది అని టీడీపీ కూటమి నేతలు కూడా వ్యాఖ్యానించారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల కూడా ఈ ఇష్యూలో తప్పు చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఆనాడు వైసీపీ ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్ తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి ఒకరు ఉన్నారు అంటూ అందులో 17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్.బి.ఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దీని మీద అమెరికా కోర్టులలో కేసులు కూడా పెట్టారని కూడా ప్రచారం సాగింది.
ఇక చూస్తే కనుక ఈ ఒప్పందం వెనక అదానీతో పాటు నాటి ప్రభుత్వం పెద్దలు ఉన్నారని కూడా విమర్శలు వచ్చాయి. వైసీపీ అధినేత జగన్ అయితే తమ మీద అసత్య ప్రచారం చేస్తున్నారు అని చెప్పి కోర్టులో పరువు నష్టం దావా కూడా కొన్ని పత్రికల మీద వేసారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఆనాడు ఈ ముడుపులో విషయంలో నేరుగా జగన్ మీదనే షర్మిల విమర్శలు చేసారు. అవినీతి జరగలేదని ప్రమాణం చేయాలని కూడా సవాల్ చేశారు. ఇక మొదట్లో టీడీపీ కూటమి పెద్దలు ఈ కేసు విషయంలో అతి ఉత్సాహం చూపించినా తరువాత తగ్గారు.
ఇపుడు సడెన్ గా షర్మిల ఈ కేసుని ప్రస్తావిస్తూ చంద్రబాబు అదానీ మీద ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. అదానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు బాబుకు శత్రువుగా కనిపించారని ఇపుడు మిత్రుడు అయిపోయారా అని నిలదీశారు. ఈ కేసులో కళ్ళ ముందు అన్ని ఆధారాలు కనిపిస్తూంటే చర్యలు ఎందుకు తీసుకోరని ఆయన అంటున్నారు.
అదానీ మోసానికి ఏపీ బలి అయిందని ఒక మాజీ సీఎం ఈ కేసులో నేరుగా భాగమయ్యారని ఆమె ఇండైరెక్ట్ గా జగన్ ని టార్గెట్ చేసారు. ఇంత జరిగినా కూడా ఏవేవో ఆధారాలు కావాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడడం ఏంటని ఆమె నిలదీస్తున్నారు.
ఆనాడు టీడీపీ లక్ష కోట్ల రూపాయల భారం ఈ ఒప్పందాల వల్ల పడింది తాడేపల్లి ప్యాలెస్ వేదికగా అవినీతి జరిగిందని ఎందుకు ఆరోపించినట్లు అని ఆమె అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల చంద్రబాబుని ఈ కేసు విషయంలో ప్రశ్నిస్తున్నా ఈ కేసులో చర్యలు తీసుకోవాలని కోరడం అంటే జగన్ మీద కూటమి ప్రభుత్వం యాక్షన్ కి సిద్ధపడాలన్న ఆలోచనతోనే అడుగుతున్నారన్న చర్చ సాగుతోంది.
ఈ మధ్య కాలంలో వైసీపీ అధినేత మీద షర్మిల విమర్శల దాడి తగ్గించారు. ఆమె కొత్త ఏడాదిలో ఎందుకో కాస్తా కార్యకలాపాలు నెమ్మదించారు. అయితే మళ్ళీ ఆమె అదానీ కేసు విషయం ఎత్తుకోవడంతో బాబుని ముందు పెట్టి విమర్శిస్తున్నా ఈ కేసులో అదానీతో ఒప్పందం చేసుకున్న నాటి ప్రభుత్వం మీద యాక్షన్ కోరుకుంటున్నారు అని అంటున్నారు. మరి దీని మీద టీడీపీ కూటమి నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.