రోజాకు జగన్ క్రికెట్ పాఠాలు... ఏకసంతాగ్రాహిలా మారిన మంత్రి!
అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు తాజాగా క్రికెట్ పాఠాలు నేర్పించారు
ఈరోజు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం.. క్రీడల ఆవశ్యకతతో పాటు.. ఈ కార్యక్రమం ఉద్దేశ్యాన్ని వివరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు జగన్ క్రికెట్ పాఠాలు నేర్పిన వీడియో వైరల్ గా మారింది.
అవును... ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన కేబినెట్ మంత్రి ఆర్కే రోజాకు తాజాగా క్రికెట్ పాఠాలు నేర్పించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన "ఆడుదాం ఆంధ్ర" కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా క్రీడల మంత్రి ఆర్కే రోజాతో కలిసి పాల్గొన్న జగన్.. ఈ సందర్భంగా ఆమెతో క్రికెట్ బ్యాట్ పట్టించారు. బ్యాట్ ఎలా పట్టుకోవాలి.. బ్యాటింగ్ ఎలా చేయాలి అనేది స్వయంగా దగ్గరుండి నేర్పించారు.
ఆడుదాం ఆంధ్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా.. క్రీడా శాఖా మంత్రిగా తొలుత పిచ్ పై బ్యాటింగ్ చేయమంటూ మంత్రి ఆర్కే రోజాను ఆహ్వానించారు జగన్. అనంతరం ఆమెకు బ్యాట్ ఇచ్చారు.. ఈ సమయంలో ఇబ్బంది పడుతున్న ఆమెకు జగన్ క్రీజులో బ్యాట్ ఎక్కడ ఉంచాలి, ఎలా నిలబడాలి, ఎలా బ్యాటింగ్ చేయాలి వంటి మెలుకువలు చేసి చూపిస్తూ నేర్పించారు.
ఇలా ఏకసంతాగ్రాహిలా నేర్చుకున్న బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టిన తొలి బంతినే క్లీన్ షాట్ కొట్టారు. దీంతో అక్కడే ఉన్న సీఎం జగన్ చప్పట్లతో ఆమెను అభినందించారు. ఈ సమయంలో జగన్ తో పాటు అక్కడున్న మంత్రులు, అధికారులు కూడా రోజాను చప్పట్లతో ఎంకరేజ్ చేశారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన సీఎం జగన్ తనదైన శైలిలో షాట్స్ ఆడారు.
ఈ సందర్భంగా బైరెడ్డి సిద్ధర్థ్ రెడ్డి బౌలింగ్ చేయగా.. మంత్రి ఆర్కే రోజా వికెట్ కీపింగ్ చేయగా.. జగన్ బ్యాట్ ఝులిపించారు. తనదైన శైలిలో స్టైలిష్ షాట్స్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.