ఎర్ర చందనం కాదు పుష్పా.. ఈ కర్రపై కన్నేయాలి!
`పుష్ప` ఫ్రాంఛైజీ చిత్రాలతో సుకుమార్ టీమ్ ఎర్రచందనం స్మగ్లర్ల కంటే ఎక్కువ ఆర్జించారని కథనాలొస్తున్నాయి.
`పుష్ప` ఫ్రాంఛైజీ చిత్రాలతో సుకుమార్ టీమ్ ఎర్రచందనం స్మగ్లర్ల కంటే ఎక్కువ ఆర్జించారని కథనాలొస్తున్నాయి. దాదాపు 1600 కోట్లు వసూళ్లు అందుకున్నారు అంటే.. ఈ సొమ్ములో వాటాలు అందుకుంటున్న అల్లు అర్జున్, సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్ ప్రతిదీ అధికారికంగా గౌరవప్రదమైన ఆర్జనగా పరిగణించాలి. ఎర్రచందనం స్మగ్లింగ్ కథల్ని దర్శకుడు సుకుమార్ ఫక్తు కమర్షియల్ సినిమాగా మార్చి ఆర్జించడం నిజంగా కళాప్రక్రియను కమర్షియలైజ్ చేసే అతడి సత్తాను ఆవిష్కరించింది. భారతదేశంలోని అత్యుత్తమ కమర్షియల్ దర్శకుల జాబితాలో అతడి పేరును నిలబెట్టాయి పుష్ప, పుష్ప2.
పుష్ప అంటే ఒక బ్రాండ్ అని సుకుమార్ - బన్ని నిరూపించారు. ఎర్రచందనం వ్యాపారం దేశవిదేశాల్లో ఎంత పెద్ద స్థాయిలో ఉందో సుకుమార్ బృందం అధ్యయనం తెరపై చూసినవారికి విస్తుగొలిపింది. విదేశాల్లో చిత్తూరు ఫారెస్ట్ ఎర్రచందనంకి ఇంత డిమాండ్ ఉంటుందని, పెద్ద మనుషులు సిండికేట్ గా మారి విదేశాలకు ఎర్రచందనం తరలిస్తారని ఇంతకుముందు వార్తల్లో చదివి మాత్రమే తెలుసుకున్నాం. కానీ పెద్ద తెరపై సుకుమార్ లైవ్ గా చూపించి ప్రేక్షకులను విస్మయంలో ముంచెత్తారు. ప్రస్తుతం సుకుమార్ పరిచయం చేసిన ఎర్రచందనం ఖరీదును మించి ఇంకే చెట్టు భూమ్మీద పుట్టలేదా? అంటూ ఆరాలు మొదలయ్యాయి.
అలా గూగుల్ లో వెతికితే, ఎర్రచందనం కాదు.. అంతకుమించి అనేలా `ఆఫ్రికన్ బ్లాక్ వుడ్` ధర పలుకుతోందని తెలిసింది. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్లు చాలా అరుదైనవి. ఈ కర్ర కేజీ ధర రూ.8లక్షలు (అక్షరాలా ఎనిమిద లక్షలు). దక్షిణ, మధ్య ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో ఈ చెట్లు విస్తారంగా పెరుగుతాయి. ఈ చెట్లు సగటున 25 అడుగులు ఎదుగుతాయని సమాచారం. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టును కట్ చేసి అద్భుతమైన కళాకృతులను తయారు చేయవచ్చు. పుష్ప 2 రిలీజయ్యాక ఈ చెట్టుకు విపరీతమైన ప్రాచుర్యం లభిస్తోంది. ప్రస్తుతం బ్లాక్ వుడ్ ని కట్ చేసి కళాకృతులను తయారు చేసే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఖరీదు రీత్యా, ఆదాయం రీత్యా పుష్ప కన్ను ఈసారి ఎర్రచందనం నుంచి బ్లాక్ వుడ్ వైపు మళ్లుతుందేమో చూడాలి!! ఒకవేళ సుకుమార్ బృందం ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ పై దృష్టి సారిస్తే అది ఇంటర్నేషనల్ మార్కెట్లోను స్టాండార్డ్ నెలకొల్పుతుందేమో!!
అసలు ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ని పెంచాలంటే ఇండియాలో సాధ్యమయ్యే పనేనా? అంటే.. ఈ మొక్కల్ని పెంచాలంటే ఎలాంటి వాతావరణం, వసతులు కావాలి? అన్నది పరిశీలించాలి. ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ చెట్టును డాల్బెర్జియా మెలనోక్సిలాన్ అని కూడా పిలుస్తారు.
ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ కింది పరిస్థితులలో బాగా పెరుగుతుంది:
సూర్యకాంతి: రోజుకు 6-8 గంటల ప్రత్యక్ష సూర్యకాంతి
ఉష్ణోగ్రత: 68–86°F (20–30°C)
తేమ: మితమైన తేమ, పొడి పరిస్థితులకు అనుకూలం..
నేల: 6.0-7.0 pHతో బాగా ఎండిపోయే, ఇసుక లేదా లోమీ నేల
నీరు: నీరు పరిమితంగా సరిపోతుంది..నీరు త్రాగుటకు లేక మధ్య నేల దాదాపు పూర్తిగా ఎండిపోయేలా చేస్తుంది.
ఎరువులు: 10-10-10 N-P-K నిష్పత్తితో సమతుల్య ఎరువులు వాడాలి. తక్కువ సారవంత నేలల సరిపోతాయి..
రీపోటింగ్: మంచి డ్రైనేజీతో కొంచెం పెద్ద కుండలో ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి రీపోట్ చేయాలి.
ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ పాక్షిక ఉష్ణమండల లోతట్టు ప్రాంతాలలో పరిస్థితులలో పెరుగుతుంది. ఈ చెట్లను ఆకురాల్చే అడవులలో, తీరప్రాంత బుష్‌ల్యాండ్‌లో చెట్లతో కూడిన గడ్డి భూములలో చూడవచ్చు. ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ అనేక ఆఫ్రికన్ అడవులలో ఆర్థికంగా లాభాలివ్వడంలో ముఖ్యమైన చెట్టు. దీనికారణంగా ఈ చెట్టు అంతరించిపోయే వృక్షాల జాబితాలో చేరింది. ఆఫ్రికా సహా అనేక దేశాలు ఆఫ్రికన్ బ్లాక్‌వుడ్ చెట్ల వ్యాపారం, కోతపై కఠినమైన నిబంధనలను విధించాయి.