ప్రముఖ బాడీ బిల్డర్‌ మృత్యువాత.. అసలేం జరిగింది!

ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత చిన్న వయసు వారిలోనూ గుండెపోట్లు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే ప్రాణాలు విడుస్తుండటం కలవరపరుస్తోంది.

Update: 2023-10-10 11:30 GMT

గుండెపోట్లు.. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అందరినీ బలి తీసుకుంటున్నాయి. చివరకు నిత్యం వ్యాయామం చేసేవారు కూడా గుండెపోట్లకు బలవుతుండటం పట్ల వైద్య నిపుణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎందుకో జరుగుతుందో తేల్చడానికి తమ పరిశోధనలను ఉధృతం చేస్తున్నారు. ముఖ్యంగా కోవిడ్‌ తర్వాత చిన్న వయసు వారిలోనూ గుండెపోట్లు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు లక్షణాలు లేకుండానే ప్రాణాలు విడుస్తుండటం కలవరపరుస్తోంది.

తాజాగా మిస్టర్‌ తమిళనాడు టైటిల్, ప్రముఖ బాడీ బిల్డర్‌ యోగేశ్‌ చెన్నైలో గుండెపోటుతో మృత్యువాత పడటం కలకలం రేపింది. చెన్నైలోని అంబత్తూరు మేనంపేడులోని మహాత్మాగాంధీ వీధిలో యోగేశ్‌ నివసిస్తున్నారు. వ్యాయామంపైన ఆసక్తితో మంచి బాడీ బిల్డర్‌ గా ఆయన ఎదిగారు. కొన్ని ఏళ్లుగా వివిధ ఛాంపియన్‌ షిప్‌ లలో అనేక పతకాలు కూడా సాధించాడు.

నిత్యం తన జిమ్‌ లో యువకులకు యోగేశ్‌ శిక్షణ ఇస్తున్నారు. ఎప్పటిలానే ఈ రోజు కూడా యువకులకు శిక్షణ ఇచ్చిన అతడు అనంతరం బాత్‌ రూమ్‌ కు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతసేపటికి తమ కోచ్‌ బయటకు రాకపోవడంతో యువకులకు అనుమానమొచ్చి వెళ్లి చూడగా యోగేశ్‌ బాత్‌ రూమ్‌ లో పడిపోయి ఉన్నారు.

దీంతో యోగేశ్‌ ను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అతడి మృతితో కుటుంబ సభ్యులు, అభిమానుల్లో తీవ్ర విషాదం నెలకొంది. యోగేశ్‌ కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. నిత్యం ఫిట్‌ నెస్‌ కు ప్రాధాన్యతనిచ్చే యోగేశ్‌.. ఇలా అర్థంతరంగా గుండెపోటుకు గురై చనిపోవడం అందరినీ నివ్వెరపరిచింది.

బాడీబిల్డింగ్‌ లో ‘మిస్టర్‌ తమిళనాడు’ అవార్డు కూడా అందుకున్న యోగేశ్‌ గుండెపోటుకు గురికావడం పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2021లో వైష్ణవి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న యోగేశ్‌ కొంతకాలంగా బాడీబిల్డింగ్‌ పోటీలకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం అతను ఓ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్నారు.

ఎప్పటిలానే ఈ రోజు జిమ్‌ కు వెళ్లిన యోగేష్‌.. శిక్షణ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బాత్‌ రూమ్‌ కు వెళ్లిన అతడు గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన జిమ్‌ యువకులు వెంటనే యోగేశ్‌ ను స్థానిక కిల్పౌక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతను గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. పెళ్లైన తర్వాత బాడీబిల్డింగ్‌కు విరామం ప్రకటించిన యోగేశ్‌.. ఒక్కసారిగా భారీ బరువులు ఎత్తడం వల్లే ఇలా గుండెపోటుకు గురయ్యారని వైద్యులు చెబుతున్నారు.

Tags:    

Similar News