కడప గడపలో షర్మిలకు భారీ షాక్

ఏపీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల ఏమి సాధించారు అంటే ఆమె ఏమి చెప్పుకుంటారో తెలియదు కానీ ఆమె పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.;

Update: 2025-03-29 06:26 GMT
కడప గడపలో షర్మిలకు భారీ షాక్

ఏపీసీసీ చీఫ్ హోదాలో వైఎస్ షర్మిల ఏమి సాధించారు అంటే ఆమె ఏమి చెప్పుకుంటారో తెలియదు కానీ ఆమె పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. కొంతమంది ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోతే మరి కొందరు పార్టీని వీడుతున్నారు. ఒకనాడు పీసీసీ చీఫ్ గా పనిచేసి కాంగ్రెస్ ఫిలాసఫీ తో పాటు ఆ పార్టీ విధానాలు జనంలో బలంగా వినిపించిన మాజీ మంత్రి అనంతపురానికి చెందిన సాకే శైలజానాధ్ కాంగ్రెస్ ని వీడి వైసీపీలో చేరిపోయారు.

చాలా మంది కాంగ్రెస్ బిగ్ షాట్స్ అయితే కాంగ్రెస్ తో తమకు పెద్దగా సంబంధం లేనట్లుగా ఉన్నారు. ఇక ఇపుడు షర్మిల సొంత జిల్లా కడప గడపలో చూస్తే భారీ షాక్ తగిలింది. ఒక కీలకమైన నాయకుడే పార్టీని వీడిపోయారు.

కడపలో కాంగ్రెస్ టికెట్ మీద 2024 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసిన ప్రముఖ మైనారిటీ నాయకుడు అఫ్జల్ ఖాన్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు ఆ ఎన్నికల్లో 24,500 ఓట్లు వచ్చాయీ అంటే బలమైన నాయకుడి కిందనే లెక్క. మరి ఆయన ఎందుకు ఈ సీరియస్ డెసిషన్ తీసుకున్నారు అంటే షర్మిల ఒంటెద్దు పోకడలతో విసిగిపోయే అని అంటున్నారు.

కాంగ్రెస్ సిద్ధాంతాలను పక్కన పెట్టి షర్మిల సొంత అజెండాతో ముందుకు సాగుతున్నారని చాలామంది పార్టీ వారు అభిప్రాయంతో ఉన్నారు. అందులో అఫ్జల్ ఖాన్ కూడా ఒకరు అని అంటున్నారు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే ఇక కష్టమే అని ఆలోచించి తన దారి తాను చూసుకోవాలనే భావించి ఈ కీలక నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.

ఆయనను తెచ్చి 2024 ఎన్నికల్లో పోటీ పెట్టడం వల్లనే ముస్లిం మైనారిటీ ఓట్లలో చీలిక వచ్చి వైసీపీ కడపలో ఓటమి పాలు అయింది అన్నది ఒక విశ్లేషణ. మైనారిటీలో బలమైన నేతగా ఉన్న అఫ్జల్ ఖాన్ పార్టీని వీడడం కాంగ్రెస్ కి దెబ్బ. దానికి మించి షర్మిలకు భారీ షాక్ అని అంటున్నారు.

ఇక కాంగ్రెస్ కి అసలే పెద్ద బలమున్న నాయకులు అయితే లేరు. మరి పాతిక వేల ఓట్లు తెచ్చే సామర్థ్యం ఉన్న అఫ్జల్ ఖాన్ లాంటి వారు పార్టీని వీడడం అంటే అసలే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ కి ఇది ఒక స్ట్రాంగ్ స్ట్రోక్ అని అంటున్నారు

ఇక కాంగ్రెస్ ని వీడిన అఫ్జల్ ఖాన్ ఏ పార్టీలో చేరుతారు అన్నది తెలియడం లేదు. ఆయన భవిష్యత్తు కార్యాచరణ అయితే తొందరలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన టీడీపీలోకి వెళ్ళే చాన్స్ లేదని అంటున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా బలమైన మాధవి రెడ్డి ఉన్నారు.

దాంతో మరో నాయకుడిగా వెళ్తే సైడ్ అయిపోయినట్లే. దాంతో ఆయన వైసీపీలో ఏమైనా చేరుతారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే వైసీపీకి కూడా కడపలో నాయకత్వం కొరత ఉంది. మాజీ మంత్రి అంజాద్ భాషా పట్ల ప్రజలలో వ్యతిరేకత ఉంది. ఆయన వ్యతిరేకత వల్ల కూడా 2024 ఎన్నికల్లో ఓటమి పాలు అయ్యారు ప్రత్యేకించి ముస్లిం సామాజిక వర్గంలో ఆయనకు పట్టు తగ్గుతోంది.

దాంతో వైసీపీ కొత్త ముఖం కోసం చూస్తోంది అని అంటున్నారు. పైగా ఆయన గతంలో వైసీపీలో ఉన్న వారే. తమ బలం ఏంటో నిరూపించుకున్న వేళ వైసీపీలో చేరితే ఆయనకు మంచి ఆదరణ దక్కే చాన్స్ ఉందని అంటున్నారు. వైసీపీ కూడా ఈసారి కొత్త ముఖాలను పరిచయం చేయాలని అనుకుంటోంది. దాంతో అఫ్జాన్ ఖాన్ వైసీపీలో చేరవచ్చు అన్న చర్చ అయితే ఉంది. చూడాలి మరి ఏమి జరుగుంతో. కానీ షర్మిలకు కాంగ్రెస్ కి మాత్రం ఈ పరిణామం భారీ షాక్ గానే చూడాలని అంటున్నారు.

Tags:    

Similar News