మ‌న అభిరుచే.. మ‌న‌కు చిరాకు: యూట్యూబ్ పొలిటిక‌ల్ యాడ్స్ లో 'ఏఐ' సంచ‌ల‌నం!

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌రం సాగుతోంది. ఇక‌, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్నాయి.

Update: 2024-04-23 12:30 GMT

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నిక‌ల స‌మ‌రం సాగుతోంది. ఇక‌, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌రుగుతున్నాయి. దీంతో అభ్యర్థులు, పార్టీలు.. ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. ఈ ప్ర‌చారంలో నాలుగు ర‌కాలు ఉన్నాయి. ఇన్‌డోర్‌, ఔట్ డోర్‌, ఇంటింటికీ, రోడ్‌షో+స‌భ‌లు. ఈ నాలుగు ప్ర‌చారాల్లోనూ పార్టీలు దుమ్మురేపుతున్నాయి. ఔట్ డోర్‌, రోడ్‌షో+స‌భ‌లు వంటివాటికి క్లాస్ లేదా.. దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు వెళ్లే అవ‌కాశం లేదు. మాస్ లేదా.. యువత ఎక్కువ‌గా ఇక్క‌డ క‌నిపిస్తారు.

దీంతో పార్టీలు, అభ్య‌ర్థులు.. ఇన్‌డోర్ ప్ర‌చారానికి ప్రాధాన్యం పెంచాయి. దీనిలో యూట్యూబ్ కీల‌కంగా మారింది. యూట్యూబ్‌లో వ‌చ్చే కార్య‌క్ర‌మాలు, సినిమాలు, రియాల్టీ షోల‌కు.. వీక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ఉన్న విష‌యం తెలిసిందే. పైగా.. స్మార్టు ఫోన్లు చేతిలోనే ఉండ‌డంతో ఏ ప‌దినిముషాలు.. గ్యాప్ చిక్కినా.. ఆటోమేటిక‌గా యూట్యూబ్‌ను ఓపెన్ చేయ‌డం ప‌రిపాటి. ఇదే రాజ‌కీయ నాయ‌కుల‌కు కూడా.. కావాల్సింది. యూట్యూబ్ వేదిక‌గా.. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్న ప్ర‌చార విలువ 5 ల‌క్ష‌ల కోట్లుగా అంచ‌నా వుంది.

ఇక‌, యూట్యూబ్‌లో కూడా.. భిన్న‌మైన వాతావ‌ర‌ణం ఉంది. ప్ర‌తి ఐదు నిమిషాలకు ఒక యాడ్ వ‌చ్చేస్తుంది. అది ఏ పార్టీది .. అనేది ప‌క్క‌న పెడితే.. మ‌న‌కు చిరాకు తెపిస్తున్న విష‌యం కూడా తెలిసిందే. ఇటీవ‌ల ఓ వినియోగ‌దారుడు.. ఇదే విష‌యాన్ని ఈసీకి కంప్ల‌యింట్ కూడా చేశారు. కానీ, ఈసీ చేతులు ఎత్తేసింది. స‌రే.. ఈ విష‌యం అలా ఉంచితే.. యూట్యూబ్‌లో చిత్ర‌మైన ప‌రిస్థితి ఉంది. ప్ర‌తి ఐదు నిముషాల‌కు వ‌చ్చే యాడ్ విష‌యంలో ఒక సంచ‌ల‌న విష‌యం దాగి ఉంది. అదే.. మ‌న అభిరుచికి త‌గిన పార్టీకి సంబంధించిన యాడ్ రావ‌డం!

మ‌న అభిరుచి ఏదో `ఎక్స్‌` అనే పార్టీపై ఉంద‌నుకోండి.. దీనికి సంబంధించిన చ‌ర్చ‌లు, నాయ‌కుల కార్య‌క్ర‌మాలు త‌ర‌చుగా యూట్యూబ్‌లో చూస్తున్నామ‌ని అనుకుంటే.. ఇక‌, ఆ `ఎక్స్` పార్టీకి సంబంధించిన యాడ్స్ మాత్ర‌మే మ‌న ఫోన్‌లో వ‌స్తుంటాయి. అవి కూడా త‌ర‌చుగా వ‌చ్చేస్తాయి. అదేవిధంగా రీల్స్ కూడా. ఇవి తప్ప‌.. ఇత‌ర పార్టీల ప్ర‌చారాలు, యాడ్స్ మ‌న‌కు పెద్ద‌గా రావు. దీనికి కార‌ణం.. `ఏఐ` మెథ‌డాల‌జీ. ప్ర‌స్తుతం ఆరేళ్లుగా యూట్యూబ్ ఏఐని వినియోగిస్తోంది.

ఏం చేస్తుంది?

యూట్యూబ్‌లో మ‌నం ఏ పార్టీకి లేదా.. వ్య‌క్తుల‌కు సంబంధించిన అంశాల‌ను మూడు నుంచి ఐదు రోజుల పాటు త‌ర‌చుగా చూశామ‌ని అనుకోండి.. మ‌న ఫోన్ సిగ్న‌ల్‌కు ఏఐ అనుసంధానం అయిపోతుంది. ఇది ఆటోమేటిక్‌గా జరిగే ప్ర‌క్రియ‌. ఇక‌, అంతే.. అక్క‌డి నుంచి అదే పార్టీలేదా.. అదే అభ్య‌ర్థికి సంబంధించిన యాడ్స్‌ను దంచి కొడుతుంది. దీంతో చిరాకు రావ‌డం స‌హజం. మ‌రి ఏం చేయాలంటే.. ఓ మూడు రోజుల పాటు.. మీ అభిరుచిని ప‌క్క‌న పెట్టి.. వేరే వేరే కార్య‌క్ర‌మాలు చూస్తే.. ఏఐ కూడా.. మెథ‌డాల‌జీ మార్చేసుకుంటుంది. సో.. ఇదీ.. యూట్యూబ్ ద్వారా ఏఐ రేపుతున్న సంచ‌ల‌నం.

Tags:    

Similar News