సంచలనంగా మారిన పుతిన్, దోభాల్ చర్చల వీడియో.. ఇంతకీ అందులో ఏముంది..?

రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ యుద్ధం తీవ్రం అవుతుందే తప్ప.. తగ్గడం లేదు.

Update: 2024-09-16 07:54 GMT

రెండేళ్లుగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ యుద్ధం తీవ్రం అవుతుందే తప్ప.. తగ్గడం లేదు. ఏ దేశం కూడా వెనక్కి తగ్గకపోవడంతో యుద్ధం నానాటికీ తీవ్రం అవుతూనే ఉంది. ఇప్పటికే యుద్ధం ద్వారా ఇరు దేశాల్లోనూ వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. యుద్ధంలో అత్యాధునిక ఆయుధాలు వాడుతూ యుద్ధాన్ని మరింత పెంచుతున్నారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ముఖాముఖి చర్చలు నిర్వహించారు. దీనిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇది తెలిసిన మోడీ హుటాహుటిన పుతిన్‌కు వివరణ ఇచ్చేందుకే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్‌ను మాస్కోకు పంపించారా అనే విమర్శలు వినిపిస్తున్నారు.

ఈ నెల 12న దోభాల్ రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు చేరుకున్నారు. పుతిన్‌తో ఆయన అంతర్గతంగా చర్చలు జరిపిన వీడియోను అక్కడి వార్తాసంస్థ స్పుత్నిక్ విడుదల చేసింది. ఇది కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఉక్రెయిన్ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడితో చర్చల సారాంశాన్ని వివరించేందుకు ఆసక్తి ఉన్నట్లు ఫోన్ చర్చల్లో ఇప్పటికే మోడీ తెలిపారు. ఆ చర్చల గురించి వ్యతిగతంగా తెలియజేసేందుకు నన్ను ఇక్కడికి పంపించారు. జెలెన్‌స్కీతో అంతరంగికంగా చర్చలు జరిగాయి. వారిద్దరే మాట్లాడుకున్నారు’ అని దోభాల్ పుతిన్‌కు వివరించారట. అలాగే. జెలెన్‌స్కీ వెంట ఇద్దరు ఉన్నారని, ప్రధాని మోడీతో తాను ఉన్నానని, చర్చలకు తాను ప్రత్యక్ష సాక్షిని అని పుతిన్‌తో మాట్లాడినట్లు ఆ వీడియోలో వెల్లడైంది.

పుతిన్‌తో మోడీకి ఎప్పటి నుంచో సన్నిహిత సంబంధాలున్నాయి. దాంతో యుద్ధం విరమించేలా ఇరు దేశాలతో చర్చలు జరిపాలని అమెరికా, ఐరోపాలాంటి దేశాలు ఇప్పటికే కోరాయి. అంతేకాదు.. ఇటీవల పుతిన్ సైతం మాట్లాడుతూ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఆగిపోవాలంటే చర్చలు భారత్‌తోనే సాధ్యపడుతాయని చెప్పారు. తాను కూడా చర్చలకు సిద్ధమని చెప్పారు. మోడీ మాత్రం.. తాము ఎవరి వైపు నిలబడేది లేదని, శాంతి వైపే తాము ఉన్నామని చెప్పుకొస్తున్నారు. ఇంతలోనే మోడీ ఉక్రెయిన్ పర్యటకు వెళ్లడం.. అక్కడ చర్చలు జరపడం కాస్త పుతిన్‌కు కోపం తెప్పించినట్లుగా తెలుస్తోంది.

Tags:    

Similar News