రాత్రి పూట స్వేచ్ఛ‌గా రోడ్లపై అంబానీలు కార్ రైడ్

కవలలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ ముంబైలో రాత్రిపూట రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

Update: 2024-10-28 14:30 GMT

కవలలు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ ముంబైలో రాత్రిపూట రైడ్‌ను ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వైర‌ల్ క్లిప్‌లో ఆకాష్ భార్య శ్లోకా మెహతా టాప్-డౌన్ రోల్స్ రాయిస్‌లో ప్రయాణిస్తూ క‌నిపించారు. ఈ ఫోటోగ్రాఫ్‌లో అంబానీ కవలలు `ఇషా అంబానీ - ఆకాష్ అంబానీ` రోల్స్ రాయిస్‌లో ఉన్నారు. ఈ జాయ్ రైడ్‌తో లగ్జరీని మ‌రో లెవ‌ల్‌కి తీసుకెళ్లారు అంబానీ కిడ్స్! ``కేవలం ఒక సాధారణ రోజు కలలో జీవించండి!`` అని అంద‌మైన శీర్షికను ఇచ్చారు.

ఇషా- ఆకాష్ రహదారిపై తమ ఉత్త‌మ ఆనందాన్ని పొందారు. ఆకాష్ అంబానీ, ఇషా అంబానీ రోల్స్ రాయిస్‌ను న‌డుపుతుండ‌గా శ్లోకా మెహ‌తా వెన‌క వైపు సీట్ లో కూర్చుని క‌నిపించారు. ముగ్గురూ కెమెరా వైపు చూస్తూ అందంగా న‌వ్వుతూ క‌నిపించారు. యాధృచ్ఛికంగా క‌వ‌ల‌లు ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ ఇటీవ‌ల (అక్టోబర్ 23న) తమ పుట్టినరోజును జరుపుకున్నారు.

ఆకాష్ అంబానీ - ఇషా అంబానీ గురించి తెలుసుకోవాలంటే వారి గురించి తెలియ‌నిది చాలా ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ .. పరోపకారి నీతా అంబానీకి ముగ్గురు పిల్లలు. కవలలు ఆకాష్ - ఇషా అంబానీ , వారి తమ్ముడు అనంత్ అంబానీ. బిలియనీర్ ముఖేష్ 1985లో నీతా అంబానీని వివాహం చేసుకున్నాడు. 1991లో వారు కవలలకు జ‌న్మ‌నిచ్చారు. అనంత్ నాలుగు సంవత్సరాల తరువాత 1995లో జన్మించాడు. ఆకాష్ అంబానీ ఒక అంతర్జాతీయ పాఠశాలలో చదివాడు. బ్రౌన్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ అతడు 2014లో ఆర్థికశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. అదే సంవత్సరం అతడు రిలయన్స్‌లో చేరాడు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ (RJIL) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. అతడు TIME మ్యాగజైన్ TIME100 వర్ధమాన తారల తదుపరి జాబితాలో పేరు పొందాడు. ఫార్చ్యూన్ 40 అండర్-40 యువ నాయకులలో ఒక‌డిగా కనిపించాడు.

రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ (ఆర్‌ఎఫ్), రిలయన్స్ ఫౌండేషన్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, , ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లలో ఇషా అంబానీ పనిచేస్తున్నారు. . ఇషా అంబానీ విద్యా ప్రయాణంలో ఆమె యేల్ విశ్వవిద్యాలయం నుండి సైకాలజీ.. సౌత్ ఆసియన్ స్టడీస్‌లో డబుల్ మేజర్‌తో గ్రాడ్యుయేషన్ పొందడం .. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుండి MBA డిగ్రీ సాధించడం ద్వారా గుర్తింపు పొందారు.

రాత్రి వేళ రైడ్ లో ఆకాష్‌ కారు వెనకే భద్రతా సిబ్బంది ప్రయాణించారు. ఈ వీడియోపై స్పందించిన నెటిజన్లు కామెంట్లు చేశారు. ‘సామాన్యుల వలే వారికీ ఎంజాయ్‌ చేయాలని ఉంటుంది`.. `కుటుంబంతో జాలీ రైడ్‌.. వాట్‌ ఏ మూమెంట్‌` అంటూ కామెంట్లు చేశారు. మ‌రోవైపు ముకేశ్‌ అంబానీ చిన్న కోడలు రాధికా మర్చంట్‌ పుట్టిన రోజు వేడుకలు ఇటీవ‌ల ముంబైలో జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ పార్టీలో కుటుంబసభ్యులతో పాటు సినీ, క్రీడా రంగానికి చెందిన ప్రముఖులు సందడి చేశారు.

Tags:    

Similar News