"..అయితే మన సినిమా హిట్ అయినట్టే!"... అల్లు అర్జున్ పై అక్బరుద్ధీన్ తీవ్ర వ్యాఖ్యలు!

‘పుష్ప-2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-12-21 11:10 GMT

‘పుష్ప-2’ విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట, తదనంతర పరిణామాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో ఈ రోజు ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సమయంలో అల్లు అర్జున్ పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అవును... సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్ గా ఉందనే విషయంపై అల్లు అర్జున్ అరెస్టుతో ఒక క్లారిటీ వచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో... దీనిపై ఇప్పటివరకూ కాంగ్రెస్ నేతలు, మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే... తాజాగా అసెంబ్లీలో సీఎం రేవంత్ ఇచ్చిన వివరణ మరొకెత్తు అని అంటున్నారు!

ఇందులో భాగంగా... సంధ్య థియేటర్ వద్ద ఘటనకు ముందు ఏమి జరిగింది, ఎలా జరిగింది, ఘటన తర్వాత ఎలాంటి పరిణామాలు నెలకొన్నాయి అనే విషయాలపై సీఎం రేవంత్ నేడు అసెంబ్లీలో సవివరంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారని అంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇందులో భాగంగా... ఈ ఘటనలో హీరో కాలు పోయిందా.. కన్ను పోయిందా.. కిడ్నీ పోయిందా.. ఎందుకు అంతా ఆయన్ను పరామర్శించడానికి అతని ఇంటివద్ద క్యూ కడుతున్నారు అని ప్రశ్నించిన రేవంత్... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని మాత్రం పరామర్శించడానికి వెళ్లలేదని అన్నారు!

ఈ విషయంపై అసెంబ్లీ రేవంత్ ప్రస్థావించడానికి కారణం.. అక్బరుద్ధీన్ వేసిన ప్రశ్న! ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి కోమాలో ఉన్నాడు.. అసలేం జరిగిందో ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని కోరడంతో.. రేవంత్ స్పందించారు.

ఇదే సమయంలో... తనకున్న సమాచారం ప్రకారం... థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని.. ఆ ఘటనలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.. మహిళ మృతి చెందిందని పక్కనున్న వాళ్లు తన హీరోకు చెప్తే... "అయితే.. మన సినిమా హిట్ అయినట్లే" అని హీరో వారితో అన్నారంటూ అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే క్రమంలో... ఈ దుర్ఘటనపై ఏమాత్రం బాధ్యత లేకుండా సినిమా చూసి వెళ్లేటప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ పూర్తి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని.. మళ్లీ జరగకుండా చూడా చర్యలు చేపట్టాలని కోరారు.

Tags:    

Similar News