వరదలో చిక్కుకున్న నాగార్జున సేఫ్... ఏమి జరిగిందంటే..?
అవును... అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు వాగులూ, వంకలు పోంగి పొర్లుతున్నాయి. ఈ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు.
తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షాలు కురిసాయి. దీంతో... వాగులూ, వంకలూ పోంగి పొర్లుతున్న పరిస్థితి. ఈ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సమయంలో హీరో నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు.
అవును... అనంతపురంలో కురిసిన భారీ వర్షాలకు వాగులూ, వంకలు పోంగి పొర్లుతున్నాయి. ఈ సమయంలో సినీ నటుడు అక్కినేని నాగార్జున ఈ వరదల్లో చిక్కుకున్నారు. ప్రముఖ జ్యూవెల్లరీ సంస్థ కల్యాణ్ జ్యూవెల్లరీకి బ్రాండ్ అంబాసిడర్ గా గత కొన్నేళ్లుగా ఉంటున్న నగార్జున.. అనంతపురంలో ఆ సంస్థ నూతన బ్రాంచ్ ఓపెనింగ్ కోసం నేడు అనంతపురం బయలుదేరారు.
ఇందులో భాగంగా... మంగళవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు నాగార్జున. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో అనంతపురం చేరుకునేందుకు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో... ధర్మవరం నుంచి అనంతపురం వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో హైవే మధ్యలో ఇరుక్కుపోయారు!
దీంతో... అనంతపురం జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇందులో భాగంగా... పెనుగొండ మీదుగా ఆయన అనంతపురం సేఫ్ గా చేర్చారు. ఇలా అనంతపురం కల్యాణ్ జ్యూవెలరీస్ కొత్త బ్రాంచ్ వద్దకు చేరుకున్న నాగార్జున.. ఆ నగల దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కింగ్ ని చూసేందుకు వందలాదిమంది అభిమానులు తరలివచ్చారు.