8 నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తి... ఎలా చేశారంటే..?

అవును... ఇటీవల నైట్రోజన్ గ్యాస్ తో దోషికి మరణశిక్ష అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

Update: 2024-09-27 06:58 GMT

మరణశిక్ష అమలు పలు రకాలనే సంగతి తెలిసిందే. ఇందులో కొన్ని ఉరివేసి చేస్తే.. మరికొన్ని దేశాల్లో తుపాకీతో బహిరంగంగా కాల్చి కూడా మరణశిక్ష అమలు చేస్తుంటారు. ఈ సమయంలో తాజాగా అమెరికాలో నైట్రోజన్ గ్యాస్ ప్రయోగం ద్వారా దోషికి మరణశిక్ష అమలు చేశారు. అయితే ఇలాంటి శిక్ష అమలు చేయడం ఇది రెండోసారి.

అవును... ఇటీవల నైట్రోజన్ గ్యాస్ తో దోషికి మరణశిక్ష అమలు చేయడం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ పద్ధతిలో రెండోసారి శిక్ష అమలుచేశారు. పని ప్రదేశంలో ముగ్గురుని చంపిన కేసులో దోషిగా తేలిన మిల్లర్ అనే వ్యక్తికి అలబామాలో ఈ శిక్ష అమలు చేశారు.

ఈ శిక్ష ఎలా అమలు చేశారు?:

దక్షిణ అలబామా జైలులో పని ప్రదేశంలో ముగ్గురిని చంపినే కేసులో దోషిగా తేలిన అలాన్ యుగేని మిల్లర్ (59) ముఖానికి అధికారులు మాక్స్ బిగించారు. అనంతరం ఆ మాస్క్ ద్వారా లోపలికి నైట్రోజన్ గ్యాస్ ను పంపించడం మొదలుపెట్టారు. దీంతో... రెండు నిమిషాల్లోనే మిల్లర్ కిందపడిపోయాడు.

అనంతరం మరో ఆరు నిమిషాల తర్వాత తుదిశ్వాస విడిచాడు. ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు... మొత్తం 8 నిమిషాల్లో మరణశిక్ష అమలు పూర్తిచేసినట్లు వెల్లడించారు. అనంతరం అతడి మరణాన్ని ధృవీకరించారు.

ఈ తరహా మరణశిక్ష రెండోసారి!:

తాజాగా అలబామాలో నైట్రోజన్ గ్యాస్ తో మరణశిక్ష అమలు చేసిన నేపథ్యంలో.. గతంలోనూ ఒక వ్యక్తికి తొలిసారి ఈ తరహా శిక్షను అమలుచేసిన విషయం చర్చకు వచ్చింది. ఈ ఏడాది జనవరిలో హత్య కేసులో నిందితుడైన కెన్నెత్ స్మిత్ (58)కి తొలిసారి దీన్ని అమలుచేశారు!

వాస్తవానికి ఈ తరహా మరణశిక్ష అమలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ఈ తరహా శిక్ష అమలుపై స్మిత్ తరుపు న్యాయవాదులు సుదీర్ఘంగా పోరాడారు. అయితే... ఈ పోరాటానికి న్యాయస్థానంలో ఊరట లభించలేదు. మరోపక్క.. ఈ శిక్ష అమలు సమయంలో అతడు నరకయాతన అనుభవించినట్లు మృతుడి బంధువులు ఆరోపించారు.

ఏమిటీ మిల్లర్ కేసు..?:

డెలివరీ ట్రక్కు డ్రైవర్ గా పనిచేసే మిల్లర్ అనే వ్యక్తి 1999 ఆగస్టు 5న అతడు పనిచేసే కంపెనీకి వెళ్లి ఇద్దరు తోటి ఉద్యోగులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి చంపేశాడు. అనంతరం గతంలో అతడు పనిచేసిన ఆఫీసుకు వెళ్లి అక్కడ ఓ ఉద్యోగిని కాల్చి చంపేశాడు. అయితే తోటి ఉద్యోగులు తనపై వదంతులు సృష్టిస్తున్నారనే అనుమానంతో ఈ హత్యలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.

దీంతో... ఈ కేసుపై లోతైన విచారణ జరిపిన అనంతరం న్యాయ్స్థానం అతడికి మరణశిక్ష విధించింది. అయితే... 2022లోనే అతడికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలుచేయాలని అధికారులు భావించినప్పటికీ.. నరాలు దొరక్కపోవడంతో అది ఫలించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా నైట్రోజన్ గ్యాస్ తో ఆ శిక్షను అమలు చేశారు.

Tags:    

Similar News