యూఎస్ లో గల్లంతైన విమానం.. గడ్డకట్టిన సముద్రంలో ప్రత్యక్షం!

అలస్కా నుంచి 10 మందితో వెళ్తున్న విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సముద్రపు మంచు మీద ఒక విమానం శిథిలాలు కనిపించాయని అధికారులు తెలిపారు.

Update: 2025-02-08 04:06 GMT

అమెరికాలో ఓ విమానం కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అలస్కా మీదుగా 9 మంది ప్రయాణికులు, ఒక పైలెట్ తో ప్రయాణిస్తున్న ఆ విమానం గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం 3:18 గంటల సమయంలో రాడార్ నుంచి విమానం జాడ అదృశ్యమైంది. ఈ సమయంలో తాజాగా ఈ విమానాన్ని గుర్తించినట్లు చెబుతున్నారు.

అవును... అలస్కా నుంచి 10 మందితో వెళ్తున్న విమానం అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో సముద్రపు మంచు మీద ఒక విమానం శిథిలాలు కనిపించాయని అధికారులు తెలిపారు. ఈ సమయంలో ఆ విమానాన్ని పరిశీలించగా.. దాని లోపల మూడు మృతదేహలు లభించాయి. ఈ సమయంలో మిగిలిన ప్రయాణికుల గురించి సెర్చ్ జరుగుతుంది.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన యూఎస్ కోస్ట్ గార్డ్ ప్రతినిధి కామెరాన్ స్నెల్.. తమ సిబ్బంది విమానాన్ని ఇంకా పూర్తిగా తెరవలేకపోయారని.. ప్రస్తుతానికి లోపల మూడు మృతదేహాలు ఉన్నాయని.. సెర్చింగ్ చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇదే సమయంలో రెస్క్యూ కోసం ఇద్దరు గజ ఈతగాళ్లను దించినట్లు తెలిపారు.

కాగా... అలస్కా పబ్లిక్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2:37 గంటలకు ఉనలక్లీట్ నుంచి తొమ్మిది మంది ప్రయాణికులు, ఒక పైలట్ తో విమానం బయలుదేరింది. ఈ సమయంలో ఓ గంటలోనే అధికారు దానికి సంబంధాలు తెగిపోయారు. ఆ సమయంలో మైనస్ 8.3 సెల్సియస్ టెంపరేచర్ తో తేలికపాటి మంచు ఉంది.

యూఎస్ సివిల్ ఎయిర్ పెట్రోల్ అందించిన రాడార్ ఫోరెన్సిక్ డేటా ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 3:18 గంటల ప్రాంతంలో విమానం ఎత్తులో వేగంగా తగ్గుదల కనిపించిందని చెబుతున్నారు. దానికి కారణం ఏమిటనేది తెలియాల్సి ఉంది.

మరోపక్క... ఈ విమానం అదృశ్యం ఘటనతో అమెరికాలో గడిచిన ఎనిమిది రోజుల వ్యవధిలో జరిగిన మూడో విమాన ప్రమాదం. జనవరి 29న ఓ వాణిజ్య జెట్ లైనర్ - ఒక ఆర్మీ హెలీకాప్టర్ ఢీకొన్న ఘటనలో 67 మంది మరణించగా.. జనవరి 31న ఫిలడెల్ఫియాలో ఒక విమానం కూలిన ఘటనలో విమానంలోని ఆరుగురు వ్యక్తులు, నేలపై ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు.

Tags:    

Similar News