ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీ... కీలక స్థానం నుంచి పోటీ!
అవును... పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపడుతున్న జగన్... ఈ క్రమంలో ఆలీకి పోటీ చేసే స్థానంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది
ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వేల ఫలితాలు, సామాజిక సమీకరణాలను ప్రాతిపదికగా తీసుకుంటూ పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభ్యర్దుల ఎంపిక కసరత్తు ఆల్ మోస్ట్ పూర్తికావొస్తుందని తెలుస్తుంది. ఈ సమయంలో సినీనటుడు అలీ విషయంలో జగన్ కీలక నీర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
అవును... పలు నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జ్ ల మార్పులు చేర్పులు చేపడుతున్న జగన్... ఈ క్రమంలో ఆలీకి పోటీ చేసే స్థానంపై ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆలీని లోక్ సభకు కాకుండా అసెంబ్లీకే తీసుకెళ్లాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికోసం నెల్లూరు జిల్లాలో ఒక కీలక స్థానాన్ని ఆలీకోసం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో కర్నూలు లో కూడా ఒక స్థానం విషయంలో ఆలీ ప్రస్థావన వస్తున్నట్లు చెబుతున్నారు.
వాస్తవానికి గత కొంతకాలంగా వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు అలీ. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో ఆలీని నిలబెట్టే అవకాశం ఉందనే చర్చ ఎప్పటినుంచో నడుస్తుంది. ఇందులో భాగంగా గుంటూరు, రాజమండ్రి, నంద్యాల ఎంపీ మొదలైన పేర్లు అప్పట్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండేవి. అయితే తాజాగా ఆలీ విషయంలో జగన్ సరికొత్త నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా నెల్లూరు నుంచి ఆలీని అసెంబ్లీకి పోటీ చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం!
ప్రస్తుతం నెల్లూరు జిల్లా విషయంలో జగన్ సీరియస్ గా ఉన్నారని అంటున్నారు. ఆ జిల్లా నుంచే వైసీపీకి గట్టి దెబ్బలు తగిలడంతో జగన్ ఈ జిల్లాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ జిల్లాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంతోపటు ఇటీవల రాజ్యసభ సభ్యుడు, జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేయడంతో జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు.
దీంతో.. నెల్లూరు జిల్లాలో ఎంపీతో సహా ఎమ్మెల్యే అభ్యర్థుఒల విషయంలోనూ జగన్ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నెల్లూరు సిటీ నుంచి కొద్ది రోజుల క్రితం సమన్వయ కర్తగా నియమింపబడిన డిప్యూటీ మేయర్ ఖలీల్ స్థానంలో సినీనటుడు అలీని ఎమ్మెల్యేగా బరిలోకి దింపే విషయంలో జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నారని తెలుస్తుంది. ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి నారాయణ బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే!
ఇదే సమయంలో ఇక్కడ ఖలీల్ ని కొనసాగించాల్సి వస్తే... కర్నూలు నుంచి ఆలీని బరిలోకి దింపే అవకాశం ఉందని అంటున్నారు. వాస్తవానికి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మార్పుపై గత కొంతకాలంగా చర్చ నఏడుస్తోంది. ఈ నేపథ్యంలో అయితే నెల్లూరు సిటీ.. లేకపోతే కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆలీ బరిలోకి దిగడం ఖాయమని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.